ఏమిటీ ఫెంగల్‌? ఎందుకు ఈ అలజడి?

తుఫాను పేరు చెబితే వణికిపోతాం. తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్‌ తుఫాను విధ్వంసం సృష్టించడానికి సిద్ధమైంది.  పుదుచ్చేరిలోని కారైకల్‌, తమిళనాడులోని మహాబలిపురం తీరాన్ని తాకనుంది. దీని ప్రభావంతో గంటకు 100 కిలోవిరీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెదర్‌ రిపోర్ట్‌ అధికారులు వెల్లడిరచారు.  పుదుచ్చేరి తీరాన్ని తాకిన తర్వాత దీని వల్ల 7 రాష్టాల్లో వినాశనం కలగవొచ్చు. ఈ క్రమంలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణ, అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. దీంతో  పాఠశాలలు, స్కూళ్లను మూసివేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచనలు జారీ చేశారు. ఈ తుపాను నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు  వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించింది.  తమిళనాడు, పుదుచ్చేరిలో పాఠశాలలు, కళాశాలలు బంద్‌ చేశారు. వర్షాకాలం ముగిసిన తర్వాత భారతదేశాన్ని ప్రభావితం చేసే రెండవ తుఫాను ఇది కావడం విశేషం. అంతకుముందు అక్టోబర్‌ చివరి రోజుల్లో తుపాను దానా వచ్చింది. ఇది ఒడిశా, మహారాష్ట్రలో విధ్వంసం సృష్టించింది. ఇప్పుడు నవంబర్‌ నెలలో ఫెంగల్‌ తుఫాను విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. దీని కారణంగా ప్రస్తుతం మొత్తం 7 రాష్ట్రాలు  హై అలర్ట్‌లో ఉన్నాయి. దీంతో తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు సహాయ శిబిరాలు ఏర్పాటు చేశాయి.

చెన్న్కె, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. ఈ నగరాల్లో ఎలాంటి పరీక్షలు లేదా కోచింగ్‌ తరగతులు ఉండవు. తమిళనాడు ప్రభుత్వం నవంబర్‌ 30 మధ్యాహ్నం నుంచి ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్‌ , పాత మహాబలిపురం రోడ్‌  సహా ప్రధాన రహదారులపై ప్రజా రవాణా సేవలను నిలిపివేసింది. బీచ్‌కి దగ్గరగా వెళ్లే  రహదారులు తాత్కాలికంగా మూసివేయ బడతాయి. ఫెంగల్‌ తుపాను సంభవించిన నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వీలుగా నవంబర్‌ 30న తమ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేసేందుకు అనుమతించాలని ఐటీ కంపెనీలకు ప్రభుత్వం సూచించింది. తమిళనాడు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 2,229 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది. తిరువారూరు, నాగపట్నం జిల్లాల్లో ఇప్పటి వరకు 164 కుటుంబాలకు చెందిన 471 మందిని సహాయక కేంద్రాల్లో  ఉంచారు. చెన్న్కె, కడలూరు, మైలదుత్తురైలలో వరదలు వచ్చే అవకాశం ఉన్నందున స్థానిక అధికారులు మోటార్‌ పంపులు, జనరేటర్లు, పడవలతో సహా అవసరమైన పరికరాలను కూడా మోహరించారు. ఫెంగల్‌ ప్రభావంతో తమిళనాడుతో పాటు ఏపీలో గ్రేటర్‌ రాయలసీమ పరిధిలోకి వచ్చే నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవబోతున్నాయి. ఈ మేరకు అధికారులు ఫ్లాష్‌ ప్లడ్స్‌ రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఫెంగల్‌ తుఫాను కారణంగా భారీ వర్షాలు రానున్నాయి.    న్కెరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న వాయుగుండం తుఫానుగా మారింది.

ఇది పుదుచ్చేరి సమీపంలో కరైకల్‌ మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెన్న్కె ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫెంగల్‌ తుఫాను ప్రభావంతో రాజధాని చెన్న్కెలో కుండపోత వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు పూర్తిగా నీటమునిగాయి. బలమైన ఈదురుగాలులతో కురుస్తున్న భారీ వర్షాలకు విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది.  దీంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.   విమానాశ్రయాన్ని  తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఇండిగో సహా పలు విమాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఎయిర్‌పోర్ట్‌ మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.   న్కెరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న వాయుగుండం తుఫానుగా మారింది. ఇది   పుదుచ్చేరి సమీపంలో కరైకల్‌ మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెన్న్కె ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ ఫెంగల్‌ తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడు రాజధాని చెన్న్కెతోపాటు సమీపంలోని చెంగల్‌పేట్‌, కాంచీపురం, తిరువళ్లూరు, మైలాడుతురై, నాగపట్నం, తిరువావూర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

భారీ వర్షాలకు ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది.   జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపో యింది. తుఫాను కారణంగా కురుస్తున్న భారీ వర్షం, బలమైన గాలులకు విమాన కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడిరది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పలు విమానయాన సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. చెన్న్కెకి రాకపోకలు సాగించే విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఇండిగో తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిరచింది. వాతావరణం అనుకూలించిన తర్వాత విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపింది.  తుఫాను నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని ఆదేశించింది.

చెన్న్కె, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు జిల్లాల్లో అన్ని పాఠశాలలు, కళాశాలలను నేడు మూసివేయాలని ఆదేశించింది. స్పెషల్‌ క్లాసెస్‌ వంటివి తీసుకోవద్దని, పరీక్షలు కూడా రద్దు చేయాలని స్పష్టం చేసింది. భారీ వర్షం హెచ్చరికలతో ఇతర జిల్లాల్లోని కలెక్టర్లు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది.  ఇక భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజా రవాణా సేవలను సైతం ప్రభుత్వం నిలిపివేసింది. ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్‌, పాత మహాబలిపురం రోడ్‌ సహా కీలక రహదారులపై ప్రజా రవాణా సేవలను నిషేధించింది. తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఈ మార్గాలపై తుఫాను వల్ల కలిగే నష్టాలను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరోవైపు చెన్న్కెలో భారీ వర్షం నేపథ్యంలో అండర్‌పాస్‌లను అధికారులు మూసివేశారు. ఇదిలా ఉండగా.. తుఫాను నేపథ్యంలో ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించాలని కంపెనీలను ప్రభుత్వం కోరారు.
  -ఎం.ఎస్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page