– పలుచోట్ల దంచికొట్టిన వర్షంతో జలమయం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 25: భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం కాస్త ఎండగా ఉన్నా అంతలోనే ఆకాశం మేఘావృతం కావడంతో ఉన్నట్టుండి వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. బోరబండ, రెహమాత్ నగర్, యూసఫ్ గూడా, ఎర్రగడ్డ ప్రాంతాలలో వర్షం కురిసింది. అలాగే, కోఠి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్ పరిసర ప్రాంతాలలో మోస్తారు వర్షపాతం నమోదైంది. అలాగే నగరంలోని ప్రధాన ప్రాంతాలైన మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, హఫీజ్‌పేట్‌లో భారీ వర్షం పడింది. మియాపూర్, చందానగర్, బీహెచ్‌ఈఎల్, మదినగూడ, నిజాంపేట్, బాచుపల్లి, దుండిగల్, మల్లంపేట ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం కురిసింది. దీంతో రోడ్లపై ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక పలు ప్రాంతాలలో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదలడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాతావరణ శాఖ సమాచారం ప్రకారం.. అల్ప పీడనం కారణంగా నగరంలో ఒకటి లేదా రెండు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
——————————————————————————————————————————————————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





