కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కరిస్తాం

– ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా ఉన్నారు
– కాంట్రాక్టర్ల అత్మహత్యలు బీఆర్ఎస్ ప్రభుత్వ పాపమే
– గత ప్రభుత్వం ఆపిన బిల్లులు మా ప్రభుత్వం చెల్లించింది
– ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 16 : కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, గత ప్రభుత్వం నుంచి పెండింగ్ ఉన్న వేల కోట్ల బకాయిలను దశలవారీగా చెల్లిస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు బిల్డర్స్, కాంట్రాక్టర్లతో క్యాంపు కార్యాలయంలో మంగళవారం సమావేశమై వారి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు ఆర్ అండ్ బి శాఖలోనే దాదాపు రూ.4,000 కోట్లు ఉన్నాయని, యాదాద్రి దేవస్థానం నిర్మాణ పనులు చేపట్టిన సంస్థలకు సైతం ఇప్పటికీ రూ.350 కోట్ల మేర బకాయిలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక ఒత్తిడులను ఎదుర్కొంటున్నప్పటికీ బకాయిల చెల్లింపులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. గత 30 నెలల్లో (కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి) ఆర్ అండ్ బి కాంట్రాక్టర్లకు రూ.3,000 కోట్లకు పైగా బిల్లులు విడుదల చేశామని, ఇంకా సుమారు రూ.2,500 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని చెప్పారు.పేరుకుపోయిన మొత్తం బకాయిలు ఒక దశలో రూ.8,000 కోట్లకు చేరాయని గుర్తు చేశారు. గత బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా నాగర్ కర్నూల్‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి సహా ఆరుగురు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు తీవ్రంగా కలచివేశాయని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. బీఆరఎస్ హయంలోనే కాంట్రాక్టర్ల ఆత్మహత్యలు జరిగాయని, తమ వాళ్లు అనుకున్న వారికే ప్రాధాన్యత ఇచ్చారని అరోపించారు. అవసరం లేని ప్రాజెక్టులపై రూ.లక్షన్నర కోట్ల ఖర్చు చేశారు కానీ రైతాంగానికి, ప్రజలకు అత్యంత అవసరమైన బ్రాహ్మణ వెల్లంల, ఎసఎల్‌బీసీ సొరంగం, పాలమూరు-రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారన్నారు. అందుకే ఆ మూడు జిల్లాల్లో ఉన్న 30 అసెంబ్లీ స్థానాల్లో కేవలం మÖడు స్థానాలకే పరిమితమయ్యారని మంత్రి వ్యాఖ్యానించారు. చిన్న కాంట్రాక్టర్లు, ఎలఈడీ లైట్ల పనులు చేసిన సంస్థలు, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన బకాయిల పరిష్కారానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఇప్పటికే రూ.140 కోట్ల మేర చెల్లింపులు జరిపామని వెల్లడించారు. ఈనెల 18న ప్రతిపాదించిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విరమించుకోవాలని బిల్డర్స్, కాంట్రాక్టర్స్‌ను కోరినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోడ్లు, వంతెనలు, అత్యవసర మరమ్మతుల పనులు నిరంతరం కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమయంలో సమ్మె లేదా ఆందోళనల వల్ల ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. 3,4 రోజులలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్కతో సమావేశం ఏర్పాటు చేసి కాంట్రాక్టర్ల సమస్యలపై సమగ్ర చర్చ జరిపి, మూడు నెలల వ్యవధిలో పెండింగ్ బకాయిల పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తామని హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లాలో వంద ఎకరాల్లో లక్ష మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి రూ.13,000 కోట్ల విలువైన హ్యామ్ రోడ్లు పనులకు త్వరలో శంకుస్థాపన జరపనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలోనే ఒకే రోజు ఇంత భారీ స్థాయిలో రోడ్ల పనులకు శ్రీకారం చుట్టడం అరుదైన ఘట్టమన్నారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని రూ.10,410 కోట్లతో ఆరు లేన్లు, రెండు సర్వీస్ రోడ్లతో విస్తరించనున్నట్లు తెలిపారు. అమరావతి, మచిలీపట్నం దిశగా గ్రీన్‌ఫీల్డ్ హైవేలు, నల్గొండ జిల్లాలో డ్రైపోర్ట్ ప్రతిపాదన, మంచిర్యాల-నాగపూర్ కనెక్టివిటీ వంటి పలు కీలక ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వ కృషితో ముందుకు సాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖల పరిధిలో ఇప్పటికే రూ.20వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు, ఒప్పందాలు పూర్తయ్యాయని, అనేక ప్రాంతాల్లో పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డీవీఎన్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న కాంట్రాక్టర్ల కుటుంబాలకు భరోసా ఇవ్వడం కోసమే మేము చలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చామన్నారు. ఇప్పటికే రెండుసార్లు డిప్యూటీ సీఎంను కలిస్తే దశల వారీగా బిల్లులు చెల్లిస్తామన్నారు.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సమస్యలు చర్చించాం.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో చర్చించి సమస్య పరిష్కరిస్తామని సానుకూలంగా స్పందించారని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.్టషన్ ఏర్పాటు చేయాలన్నారు. మన్ననూర్ దగ్గర నల్లమల స్టేషన్, సోమశిల సమీపంలో స్టేషన్ ప్లాన్ చేయాలి. టూరిజం ప్రాంతాలను దృష్టిలో ఉంచుకొని రైల్వే లైన్ ఉండాలి. హైదరాబాద్ (శంషాబాద్)బుల్లెట్ ట్రైన్ హబ్‌గా పిలవాలి. వరంగల్ ఎయిర్‌పోర్ట్ డిజైన్‌లపైన ముఖ్యమంత్రి చర్చించారు. ఈ ఎయిర్‌పోర్టు కాకతీయ సామ్రాజ్య వారసత్వ సంపద అడుగడుగునా ఉట్టిపడేలా ఉండాలన్నారు. ఎయిర్‌పోర్టు ముందు భారీ ఐలాండ్ ఉండాలని, అందులో రాణి రుద్రమ, రుద్రదేవుడు విగ్రహాలతోపాటు భారీ నంది విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారు. వరంగల్ ఎయిర్‌పోర్టు డిజైన్స్‌పై దిల్లీ వెళ్లి ఎయిర్‌పోర్టు అథారిటీ అధికారులతో చర్చలు జరపాలన్నారు. సమీక్షకు ఎంపీ వేం నరేందర్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, టీజీఐఐసీ కమిషనర్ శశాంక, రంగారెడ్డి కలెక్టర్ నారాయణ రెడ్డి, ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ ప్రావీణ్య హాజరయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *