నాణ్యమైన చేపల ఆహారాన్ని అందించడమే లక్ష్యం

– ఫిష్ క్యాంటీన్‌ను సందర్శించిన మంత్రి వాకిటి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 31 : చేపలు అత్యంత పోషక విలువలు కలిగిన ఆహారమని, ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో వాటి వినియోగం కీలక పాత్ర పోషిస్తాయని పశు సంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మాసబ్ ట్యాంక్‌లోని రాష్ట్ర మత్స్య శాఖ ప్రధాన కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించగా ఆయనకు మత్స్యశాఖ డైరెక్టర్ నిఖిల, అదనపు డైరెక్టర్ మురళీకృష్ణ, శాఖ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మత్స్య శాఖ నిర్వహిస్తున్న ఫిష్ క్యాంటీన్‌ను సందర్శించి అక్కడి నిర్వహణ, పరిశుభ్రత, ఆహార నాణ్యత, వినియోగదారులకు అందిస్తున్న సేవలను పరిశీలించారు. క్యాంటీన్‌లో అందుబాటులో ఉన్న చేపల వంటకాలు, మెనూ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా చేపల ఆహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని మరింతమంది ప్రజలకు ఫిష్ క్యాంటీన్ సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, క్యాంటీన్‌ను మరింత ఆధునికంగా అభివృద్ధి చేయాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *