– సునామి హెచ్చరికలు జారీ
న్యూదిల్లీ, అక్టోబర్ 10:ఫిలిప్పిన్స్‌లో భారీ భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూ ప్రకంపనల తీవ్రత రిక్టార్ స్కేలుపై 7.4 మాగ్నిట్యూడ్‌గా నమోదు అయింది. శుక్రవారం ఉదయం ఫిలిప్పిన్స్ దేశంలోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. మిండనావోలోని కోస్టల్ ఏరియాలోనూ వరసగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. వాటి తీవ్రత రిక్టార్ స్కేలుపై 2.6 మాగ్నిట్యూడ్, 4.9 మాగ్నిట్యూడ్‌గా నమోదు అయింది. భూప్రకంపనలకు ముందు ’ది పసిఫిక్ సునా వార్నింగ్ సెంటర్’ ఫిలిప్పిన్స్‌కు సునా హెచ్చరికలను జారీ చేసింది. 10 అడుగుల మేర అలలు ఎగసిపడే అవకాశం ఉందని తెలిపింది. అయితే, భూప్రకంపనలు రావటంతో సునా హెచ్చరికలను ఎత్తివేసింది. ప్రస్తుతం భూప్రకంపనలకు సంబంధించిన వీడియోలు సోషల్ డియాలో వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో.. భూప్రకంనల కారణంగా రోడ్డుపై ఉన్న వాహనాలు, స్థంభాలపై ఉన్న తీగలు వేగంగా ఊగుతూ ఉన్నాయి. జనం వాహనాలు ముందుకు పోనివ్వకుండా రోడ్డుపైనే నిలిపేశారు. ఫిలిప్పిన్స్‌లో భూప్రకంపనల కారణంగా ఇండోనేషియాలోని తలౌద్ ఐలాండ్స్, నార్త్ సులవేసిలలో మైనర్ సునాలు వచ్చాయి. మైనార్ సునాల కారణంగా అలలు 3.5 సెంటీ మీటర్ల నుంచి 17 సెంటీ మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి. ఈ విషయాలను ఇండోనేషియా ఎర్త్‌క్వాక్ అండ్ సునా సెంటర్ అధికారికంగా వెల్లడించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





