– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: బీజేపీ వేమనపల్లి మండల శాఖ అధ్యక్షుడు ఏటా మధుకర్ మృతిపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అనుమానాస్పద మృతిపై పార్టీ దిగ్భ్రాంతి చెందిందన్నారు. మధుకర్ ధైర్యంగా, సమర్థంగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొని ప్రజా సమస్యలు పరిష్కరించేవారని ఆయన తెలిపారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజకీయ అక్కసుతో ఆయనపౖౖె అక్రమ కేసులు బనాయించి తీవ్రంగా వేధించడంతో మనోవేదనకు గురయ్యారని, దాంతో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని మధుకర్ మృతిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని రామచందర్‌రావు డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





