జీహెచ్‌ఎం‌సీ వార్డుల డీలిమిటేషన్‌

‌- గడువును 19 వరకు పొడిగించిన హైకోర్టు
– జనాభా సంఖ్య, మ్యాపులను డొమైన్‌లో ఉంచాలని ఆదేశం

హైదరాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్‌ 17: ‌జీహెచ్‌ఎం‌సీ వార్డుల డీలిమిటేషన్‌ ‌పక్రియపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్‌ 17‌తో ముగిసే అభ్యంతరాల సమర్పణ గడువును మరో రెండు రోజులు అంటే డిసెంబర్‌ 19 ‌వరకు పొడిగిస్తూ ఆదేశించింది. పిటిషనర్ల న్యాయవాదులు మూడు రోజులు పొడిగించాలని కోరగా, డెడ్‌లైన్‌ ‌దగ్గరపడటంతో రెండు రోజులు సరిపోతాయని హైకోర్టు పేర్కొంది. అదనంగా, వార్డుల వారీగా జనాభా సంఖ్యతో పాటు మ్యాప్‌లను 24 గంటల్లోపు పబ్లిక్‌ ‌డొమైన్‌లో ఉంచాలని జీహెచ్‌ఎం‌సీకి ఆదేశించింది. ఇది ప్రజలు అభ్యంతరాలు సమర్పించడానికి సహాయపడుతుందని కోర్టు అభిప్రాయపడింది. సెన్సస్‌ ‌కమిషనర్‌ ఇచ్చిన డిసెంబర్‌ 31 ‌డెడ్‌లైన్‌ ‌గురించి అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌వాదనలు వినిపించారు. జీహెచ్‌ఎం‌సీ పరిధిని విస్తరించి 150 నుంచి 300 వార్డులకు పెంచుతూ డిసెంబర్‌ 9‌న ప్రాథమిక నోటిఫికేషన్‌ ‌జారీ అయింది. దీనిపై వెల్లువలా అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పక్రియలో పారదర్శకత లేకపోవడం, సరిహద్దులు అశాస్త్రీయంగా ఉండటం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆదేశాలతో డీలిమిటేషన్‌ ‌పక్రియ మరింత పారదర్శకంగా సాగే అవకాశం ఉంది. ప్రజలు తమ అభ్యంతరాలు సమర్పించుకోవడానికి అదనపు సమయం లభించింది. ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్‌ ‌స్థానాలు, మున్సిపల్‌ ‌వార్డులు వంటి ఎన్నికల యూనిట్ల సరిహద్దులను జనాభా మార్పుల ఆధారంగా సర్దుబాటు చేయడం చేస్తారు. జనాభా పెరిగితే లేదా తగ్గితే, ప్రతి ఎన్నికల ప్రాంతంలో వోటర్ల సంఖ్య సమానంగా ఉండేలా చూడటం,ఒక వార్డులో జనాభా చాలా పెరిగితే, దాన్ని రెండు వార్డులుగా విభజించి సరిహద్దులు మార్చడం చేస్తారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page