మైలార్‌దేవ్‌పల్లిలో కారు బీభత్సం

– ఒకరి మృతి.. తండ్రీకొడుకులకు తీవ్ర గాయాలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 17: నగరంలోని మైలార్‌దేవ్‌పల్లిలో ఇన్నోవా కారు బీభత్సం సృష్టించింది. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి కారు దూసుకెళ్లడంతో ఒకరు మరణించగా, తండ్రీ కొడుకులు తీవ్రంగా గాయపడ్డారు.బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో వేదంగా దూసుకొచ్చిన ఇన్నోవా కారు అదుపుతప్పి దుర్గానగర్‌ వద్ద ఓ షెడ్డులోకి దూసుకెళ్లిది. దీంతో అందులో నిద్రిస్తున్న వారిపైనుంచి వెళ్లింది. ఈ ప్రమాదంలో దీపక్‌ (25) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. అతని తండ్రి ప్రభుమహరాజ్‌ (60), సత్తునాథ్‌ (27) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఉస్మానియా దవాఖానకు తరలించారు. బాధితులు మధ్యప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. శంషాబాద్‌ నుంచి సంతోశ్‌నగర్‌ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కాగా, ప్రమాదానికి కారణమైన కారులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, మరో ముగ్గురు పరారీలో ఉన్నారని వెల్లడిరచారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page