– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4:ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా గోదావరి జలాలు ఎదురెక్కడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు తన ప్రాముఖ్యతను మరోసారి నిరూపిస్తోందని అన్నారు. రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువను పునరుజ్జీవింపజేస్తూ వరద కాలువలోని రాంపూర్, రాజేశ్వరరావుపేట పంప్‌హౌస్‌ల నుంచి నీటిని ఎత్తిపోసి సుమారు రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తూ రాష్ట్ర రైతుకు కాళేశ్వరం ప్రాజెక్టు భరోసాను ఇస్తున్నదని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా ఈ నీటిని తమ పొలాల్లో చూస్తున్న రైతన్నలకు నిజాలేమిటో తెలుసని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టారు. ఎస్సారెస్పీకి కాళేశ్వరం జలాలు ఎదురెక్కుతున్న వీడియోను షేర్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు