- సభ్యుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి
- ఎథిక్స్ కమిటికీ రికమెండ్ చేయాల్సిందే
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 13 : శాసనసభ స్పీకర్ నుద్దేశించి సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై నీటిపారుదల, పౌరసరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam kumar Reddy) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ భారత పార్లమెంట్ ప్రజాస్వామ్య వ్యవస్థలో స్పీకరే సుప్రీం అని ఆయన తేల్చిచెప్పారు జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ పార్లమెంటరీ వ్యవస్థను అవమానించడమే నని ఆయన పేర్కొన్నారు స్పీకర్ ను ప్రశ్నించే అధికారం ఏ ఒక్కరికీ ఉండదని స్పష్టం చేశారు. దళిత జాతికి చెందిన సీనియర్ నేత స్పీకర్ హోదాలో ఉన్న అటువంటి వ్యక్తి పై చేసిన వాక్యాలు ఆయన ఆహంకార ధోరణిని బయట పెట్టినట్లయిందని ఆయన అన్నారు.
ఈ తరహాలో ఏ సభ్యుడు మాట్లాడినా ఊపేక్షింది లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు గతంలో వారు అధికారంలో ఉండగా ఇదే సభలో గవర్నర్ ప్రసంగం సమయంలో అప్పటి సభ్యులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి,సంపత్ కుమార్ ల సభ్యత్వ రద్దు అంశాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. స్పీకర్ కు ఏమి అధికారం ఉందంటూ స్పీకర్ వ్యవస్థను, శాసనసభ వ్యవస్థతో పాటు పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అవమాన పరిచే విదంగా మాట్లాడిన సదరు సభ్యుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తూ…ఈ అంశాన్ని శాసనసభ ఎథిక్స్ కమిటీకి పంపాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు.