ఓటిఎస్‌ను వినియోగించుకోండి

– కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24: న‌గ‌ర ప‌రిధిలో ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ‌సూచించారు. పన్ను బకాయిలపై వడ్డీని 90 శాతం మాఫీ చేస్తూ పురపాలక శాఖ వన్‌ ‌టైం స్కీమ్‌ (ఓటీఎస్‌) ‌ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తుల యజమానులు ఓటీఎస్‌కు అర్హులని, ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31వ తేదీ వరకు ఓటీఎస్‌ ‌గడువు ఉందని పేర్కొన్నారు. విలీన మునిసిపాల్టీల పరిధిలోనూ మాఫీ వర్తిస్తుందని, పన్ను చెల్లింపుదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బల్దియా పౌర సేవ కేంద్రాలు, బిల్‌ ‌కలెక్టర్లు,  సేవా, ఆన్‌లైన్‌ ‌మొబైల్‌ ‌యాప్‌ ‌ద్వారా పన్ను చెల్లించవచ్చన్నారు. కాగా, ఈ నెల 4వ తేదీన పురపాలక శాఖ ఓటీఎస్‌ ఉత్తర్వులు జారీ చేయగా, జీహెచ్‌ఎం‌సీ బయటక చెప్పకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పౌరుల నుంచి పూర్తి పన్ను వసూలు చేసే క్రమంలోనే జీఓ విడుదలను రహస్యంగా ఉంచారా? మరేదైనా కారణం ఉందా..? అన్నది చర్చనీయాంశంగా మారింది. సోమవారం ఓటీఎస్‌ ‌జీఓ బహిర్గతం కావడంతో 90 శాతం వడ్డీ మాఫీ పోను మిగిలిన పన్ను బకాయి ఆన్‌లైన్‌లో కనిపిస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page