– తొలి బృందానికి చందర్‌కోట్ వద్ద స్వాగతం
శ్రీనగర్, జూలై 2 : హిమాలయాల్లో వెaసిన పవిత్ర అమర్‌నాథ్ హిమలింగ దర్శన యాత్ర ప్రారంభమైంది. క్షేత్ర దర్శనానికి బాల్తాల్ రూట్‌లో వెళ్తున్న భక్తుల తొలి బృందానికి జమÖ్మ`శ్రీనగర్ జాతీయ రహదారిపై ఉన్న చందర్‌కోట్ వద్ద ఘన స్వాగతం లభించింది. రాంబన్ జిల్లా యంత్రాంగం, సివిల్ సొసైటీ సభ్యులు, వివిధ సంస్థలు భక్తులకు ఆత్మీయ ఆతిథ్యంతో స్వాగతం పలికాయి. అంతకుముందు జమÖ్మలోని భగవతీ నగర్ బేస్ క్యాంప్ నుంచి లెప్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ వార్షిక యాత్ర కాన్వాయ్‌ను జెండా ఊపి ప్రారంభించారు. భక్తులను స్వాగతించిన వారిలో డీఐజీ సర్గూన్ శుక్లా, రాంబన్ డిప్యూటీ కమిషనర్ మహమ్మద్ అలియాస్ ఖాన్, ఎసఎస్పీ అరుణ్ గుప్తా, ట్రాఫిక్ ఎసఎస్పీ రాజా ఆదిల్ హవిÖద్ సహా పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. తర్వాత, భక్తులు బస చేసే మొదటి ప్రధాన కేంద్రం చందర్‌కోట్. ఈ పవిత్ర యాత్ర సాఫీగా, సురక్షితంగా సాగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల చర్యలు చేపట్టింది. చందర్‌కోట్ లంగర్ సైట్ వద్ద భక్తులకు అవసరమైన వసతులు, భోజన సదుపాయాలను సిద్ధం చేశారు. పోలీస్, ఆర్మీ, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్, ట్రాఫిక్ పోలీస్, ఆరోగ్య శాఖ, ఎమర్జెన్సీ సర్వీసెస్ వంటి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




