తెలంగాణ కోసం సాయుధ పోలీసులతో నిరాయుధ ప్రజల పోరాటం

25. జనధర్మో విజయతే: 3.10.2025 శతజయంతి

జూన్ 2 గొప్పతనం

(జూన్ 2 అనుకోకుండా తెలంగాణ పోరాటంలో ఒక గణనీయమైన తేదీ. తరువాత 2014లో తెలంగాణ అవతరణ దినోత్సవం అవుతుందని ఊహించలేదు.) జూన్ 2వ తేదీన నిరసన దినంగా ప్రకటించటం విజ్ఞప్తిని హైదాబాద్ అబిడ్స్ లోని ఒక హోటల్ యజమాని సోడా సీసాలు విసిరించి సవాల్ చేశారు. సమైక్యతావాదులు అనబడే వర్గపు వాలంటీర్లు- రౌడీలు ఆందోళకులపై యుద్ధం ప్రకటించారు. పోలీసులు- రెండువర్గాల మధ్య జరిగే ఘర్షణను నివారించటం పేరుతో లాఠీలు, బాష్పవాయువు, తుపాకి కాల్పులు ప్రయోగించారు. ఫలితం ఆరుగురు హైదరాబాద్ లో, పోస్టాఫీసు వద్ద శాంతియుతంగా సత్యాగ్రహం పికెటింగ్ చేస్తున్న వారిపై కాల్పులు , మరో ఇద్దరు వరంగల్ లోనూ మరణించారు. ఆ తరువాత మరొకరు మరణించారు. అనేకులు గాయాలతో హాస్పిటల్లో చేర్చబడ్డారు.

యం యస్ ఆచార్య శతజయంతి సంవత్సరం 3 అక్టోబర్ 2025. దేశమంతా తెలంగాణ బాగుపడాలని, వరంగల్లు ప్రముఖ సాంస్కృతిక కేంద్రంగా, గొప్పరచయితలు సాహితీ వేత్తలకు గుర్తింపురావాలని కలలు కన్నారు. ఆయన మరో పేరు ‘‘ఎస్వాసు’’ అని చాలా మందికి తెలియదు. ఎస్. వాసు అనీ, శ్రీనివాసు అనీ, మాడభూషి శ్రీనివాసాచార్య అని అనేక సందర్భాలలో పిలుచుకునే వారు. వరంగల్ వాణి పత్రికలో జనధర్మ వార పత్రికలో, బాలాజీ ప్రింటింగ్ ప్రెస్ లో మాకు తెలిసి పెద్ద అయ్యగారు అనేవారు. 12 సంవత్సరాలు 1973 నుంచి 1984 సంవత్సరాలు వరంగల్లు నుంచి హైదరాబాద్ జర్నలిస్ట్ గా వెళ్లేవరకు నన్ను చిన్న అయ్యగారు అని ప్రెస్ మిత్రులు అనేవారు.

1994 జులై 12న చివరిశ్వాస కోసం వరంగల్లు శ్రేయస్సుకోసం పరితపించిన వ్యక్తి. సాధారణంగా స్వాతంత్ర్య సమర యోధుడనీ, ప్రముఖ జర్నలిస్టు అనీ, 1948 నుంచి వరంగల్ ఆంధ్రపత్రిక విలేకరి అనీ 1958 నుంచి తెలంగాణకు పరిచయం తెలిసిన జనధర్మ వార పత్రిక సంపాదకుడనీ, 1980 నుంచి వరంగల్ వాణి పత్రిక సంపాదకుడనీ వ్యవస్థాపకుడనీ తెలిసిన వారే అంటాం. తప్పేమీ లేదు. కాని వరంగల్లు అని ప్రేమించినవాడు అనీ అంటేనే సరైన అభివర్ణన అవుతుంది. ముఖ్యంగా తెలంగాణ స్వంతంగా ఒక రాష్ట్రం కావాలని కలలు కన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దెబ్బ తింటున్నదని వందలాది వార్తలు, వ్యాసాలు ప్రసంగాలు చేసిన జర్నలిస్టు యం యస్ ఆచార్య. మొదట హైదరాబాద్ రాష్ట్రం నుంచి విముక్తికావాలని పోరాడారాయన. 1956లో ఆంధ్రలో విలీనీకరణను వ్యతిరేకించారు. తరువాత 1969 నుంచి తెలంగాణ కోసం పోరాడారు. 1972 దశలో కూడా ప్రయత్నాలు విఫలమైనా పోరాడారు.

కాని తెలంగాణ నిజం కావడానికి 2014 కాలం అవసరమైంది. కాని ఆనాటికి 1994కు ఆచార్య లేరు. కె జయశంకర్ లేడు, కాళోజీ లేడు. కాళోజీ రామేశ్వరరావు లేడు. పల్లారామకోటార్య లేడు. పేర్వారం జగన్నాథం లేడు. కోవెల సంపత్కుమార లేడు. ఇంకా ఎందరో తెలంగాణ చూడకుండానే వెళ్లిపోయారు. కాని తెలంగాణ వర్థిల్లిందని ఏ లోకంలో ఉన్నా సంతోషిస్తారనే అనుకుంటాను. కాని వారు కలలు కన్న తెలంగాణను మనం నిలబెట్టుకుంటున్నామా, బతికించుకుంటున్నామా, తెలంగాణ మనకోసం మన ప్రగతికి శ్రమిస్తున్నారనీ, పనికి రాని అవినీతి రాజకీయాలకు లంచాలకోసం బలిచేస్తున్నామనీ భయమవుతున్నది.

తెలంగాణ గురించి కలం రాయని క్షణం ఆయనకు లేదు. రచన ఆగలేదు. యం యస్ ఆచార్య తన రచనల నుంచి కొన్ని వ్యాసాల భాగాలను ఇక్కడ ఉటంకిస్తున్నాను. ‘‘తెలంగాణ ప్రజాసమితి ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతున్నారు. ఈ కోరికకు ప్రత్యామ్నాయం ఏది లేదు. అగ్ర నాయకులు మరో ప్రత్యామ్నాయం కోసం పాటు పడటం వృథా? అటువంటివి తాత్కాలికంగా ఫలించినట్లు కనిపించినా ఫలించేట్లు తమ జాతీయ నాయకత్వపు పరపతిని పణంగా పెట్టినా అవన్నీ స్వల్ప కాలికమే!

స్వపరిపాలన వాంఛను మరపించే సుపరిపాలననేదేదీ ఈ ప్రపంచంలో లేదు. పత్రికలుగాని, నాయకులుగాని ప్రజలు ఒక నిర్ణయానికి రాకముందే చెప్పేదీ, చెప్పగలిగేదీ. ప్రజలే తమకు కావలసిందేదో నిర్ణయించుకొని అందుకోసం పోరాడుతున్నప్పుడు దాన్ని వ్యతిరేకించటం నియంతృత్వమే అనిపించుకుంటుంది. విశాల రాష్ట్రంలో తమ ప్రయోజన – అభిమాన గౌరవాలు దెబ్బ తిన్నాయన్నది తెలిసిం తర్వాత, అంత నగ్నంగా తెలిసేట్లు పరిస్థితులు తాండవించిన తరువాత ఇప్పుడు నీతులు వల్లించటం కూడా మరో విధంగా అవమానించటమే. కనక ప్రజానిర్ణయాన్ని మాయోపాయంచేత మభ్యపరచాలని, వంచించాలని ప్రయత్నించేకన్న వారి హక్కును వారికి వదిలేయటం ప్రజానాయకులకు, మిగిలినవనీ కర్తవ్యం కూడా. ప్రజాభిప్రాయం ఇంకా స్పష్టం కావాలంటే ‘రిఫరెండం’ పెట్టినా సరే!

డా॥ ఎం. చెన్నారెడ్డిగారు ప్రజాసమితికి అధ్యక్ష స్థానం స్వీకరించి కొత్త కార్యవర్గాన్ని ఏర్పరచిన సందర్భలో ఆయన నాయకత్వాన్ని సవాల్ చేసి రెండవ ప్రజాసమితి శ్రీధర్ రెడ్డిగారి నేతృత్వాన అవతరించటం వలన తెలంగాణా ఉద్యమం చీలిపోయిందనుకున్న వారిది భ్రాంతి అని తరువాతి సంఘటనలు తేల్చివేసినవి. ఈ భ్రాంతితో కొన్ని వార్తలు వింత వ్యాఖ్యానాలు కూడా సాగినవి. శ్రీధర్ రెడ్డిగారి ఈ చీలిక పద్దతిని శ్రీ మల్లిఖార్జున్ ప్రభృతి విద్యార్థి నాయకులు విమర్శించటమేగాక, సమైక్యవాదులు రక్షణవాదులైన కొందరూ, ప్రభుత్వాన్ని సమర్థించే వ్యభిమానులూ శ్రీధర్ రెడ్డిగారి నాయకత్వాన ఉన్న ప్రజాసమితి చెన్నారెడ్డిగారి వర్గ నేతృత్వంపై గల వైరుధ్యంతో రాష్ట్ర సమైక్యతా పోరాటం సాగిస్తారనే ప్రచారం కూడా చేశారు. వాస్తవానికి ఇవన్నీ హాస్యాస్పదమని తేలిపోయినవి. కాగా ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న ఆందోళన విస్తృతి రూపాన్నే గాక ఇతోధిక శక్తివంతం అయిందనటం నిస్సందేహం.

తెలంగాణా పత్రికా రచయిత సంఘం
మే 26 నుండి శాంతియుత సత్యాగ్రహం వగైరా తెలంగాణా అంతటా జరుగుటకు శ్రీ చెన్నారెడ్డిగారి పిలుపు. వ్యతిరేకులైన వారిని తెలంగాణా ఆందోళనకు సుముఖులుగా మార్చటానికి శ్రీధర రెడ్డి గారు ఇచ్చిన పిలుపు అనుకున్నదానికన్న జయప్రదంగా సాగినవి. సత్యాగ్రహాలూ పికెటింగులలో వేలాది మంది అరెస్టులు కాగా. ఉద్యమ వ్యతిరేకులైన వందలాది ఆంధ్రులు సహా-ఉద్యమ సుముఖులైనారు. జిల్లాలలో కూడా సాగిన “నచ్చచెప్పె” కృషివల్ల వరంగల్ జిల్లా పరిషత్తు ప్రత్యేక రాష్ట్రం కావాలనే తీర్మానం చేసింది. మరొక వైపున మాజీ రాష్ట్రమంత్రి శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ నాయకత్వాన శ్రీ టి హయగ్రీవాచారిగారి కార్యదర్శత్వంలో జూన్ ఒకటో తేదీన తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెసు అంతరించి ప్రత్యేక రాష్ట్రం కోరుతూ తీర్మానించింది. ఇంకో వైపున తెలంగాణా పత్రికా రచయితల సంఘం ఏర్పడింది.

జూన్ 2 గొప్పతనం
(జూన్ 2 అనుకోకుండా తెలంగాణ పోరాటంలో ఒక గణనీయమైన తేదీ. తరువాత 2014లో తెలంగాణ అవతరణ దినోత్సవం అవుతుందని ఊహించలేదు.) జూన్ 2వ తేదీన నిరసన దినంగా ప్రకటించటం విజ్ఞప్తిని హైదాబాద్ అబిడ్స్ లోని ఒక హోటల్ యజమాని సోడా సీసాలు విసిరి సవాల్ చేశారు. సమైక్యతావాదులు అనబడే వర్గపు వాలంటీర్లు- రౌడీలు ఆందోళకులపై యుద్ధం ప్రకటించారు. పోలీసులు-రెండువర్గాల మధ్య జరిగే ఘర్షణను నివారించటం పేరుతో లాఠీలు, బాష్పవాయువు, తుపాకి కాల్పులు ప్రయోగించారు. ఫలితం ఆరుగురు హైదరాబాద్ లో, పోస్టాఫీసు వద్ద శాంతియుతంగా సత్యాగ్రహం పికెటింగ్ చేస్తున్న వారిపై కాల్పులు , మరో ఇద్దరు వరంగల్ లోనూ మరణించారు. ఆ తరువాత మరొకరు మరణించారు. అనేకులు గాయాలతో హాస్పిటల్లో చేర్చబడ్డారు. అంతకు పూర్వం హైద్రాబాద్ జైలులోని ఆంధ్ర ఖైదీలను సత్యాగ్రహుల పైకి వదిలారని ఆబిడ్స్ లోని దుర్గా విలాస్ హోటల్, బృందావన్ హోటల్ వంటివాటిలో తెలంగాణా సత్యాగ్రహులను చావబాదించటానికి రౌడీమూకలను ఆర్థనైజ్ చేస్తున్నారనీ, కొందరు తెలంగాణ సత్యాగ్రహులను ఒంటరి చేసి కొడుతున్నారని, ప్రజలను మరింత రెచ్చగొడుతున్నారని వివరించారు.

పోలీసు చర్యల తర్వాత
హైదారాబాద్ పై పోలీసు చర్యల తర్వాత ఏర్పడిన సివిల్ పరిపాలనలో అధికారులు వందల సంఖ్యలోనూ, ఆంధ్ర తదితర ఇతర ప్రాంతాల నుండి దిగుమతి చేయబడ్డారు. శ్రీ బూర్గుల వారి ఆధ్వర్యాన పరిపాలన సాగిన రోజుల్లో కూడా ఇదే పద్ధతి సాగింది. 1953లో ‘నాన్ ముల్కీ’ ఆందోళన రావడానికి ఇదే కారణం. ఈ ఆందోళన కూడా విద్యార్థులే ప్రారంభించారు. అరెస్టులు, లాటీ బాష్పవాయు ప్రయోగాలు, కాల్పులు-మరణాలు జరిగింతర్వాతి ఆందోళన కారణాలను తొలగించటానికి ప్రభుత్వం ఏవో కొన్ని చర్యలు తీసుకున్నది. ఈ ఆందోళన సందర్భంలోనూ, పోలీసు చర్యకు పూర్వం రజాకార్ల – వారి పరిపాలకుల దౌర్జనకాండ సమయంలోనూ, తలదాచుకొనుటకై ఆంధ్ర ప్రాంతానికి వలసవెళ్లినప్పుడు సోదరులు “ఆతిధ్యం” వల్లనూ కలిగిన అనుభవానుభూతులను మనసులో ఉంచుకున్న తెలంగాణా ప్రజలు 1956లో ఆంధ్రలో విలీనీకరణను వ్యతిరేకించారనటంలో సందేహంలేదు. విలీనీకరణను ప్రజలు, విద్యార్థులు నిరాకరించారు. ఎస్. ఆర్. పి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును సిఫార్సు చేసింది. రామానందతీర్థ. వి బి. ప్రభృతులు విలీనీకరణకు మద్దతు ఇచ్చినా డా।। రామక్రిష్ణారావు, కొండా వెంకటరంగారెడ్డి, జె.వి.నర్సింగరావు. డా॥ చెన్నారెడ్డి ప్రభృతులు వ్యతిరేకించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page