రంగారెడ్డి, ప్రజాతంత్ర, మే 16: మొయినాబాద్ ఫామ్ హౌస్ దారుణ ఘటన వెలుగు చూసింది. ఇద్దరు మహిళలను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గురైన వారి మృతదేహాలను పరిశీలించారు. అయితే, మృతులను తాండూరులో అదృశ్యమైన ఇద్దరు వృద్ధులుగా పోలీసులు గుర్తించారు. వీరి వయసు దాదాపు 60 సంవత్సరాలు ఉంటుందని భావిస్తున్నారు. బాధితులను వికారాబాద్ నుంచి తీసుకొచ్చి ఫామ్ హౌస్లో హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


