కోమటిచెరువు ప్రాంతంలో కొలువుదీరనున్న తిరుపతి వెంకటేశుడు
టిటిడి ఛైర్మన్ బిఆర్.నాయుడిని కలిసి
కోరిన ఎమ్మెల్యే హరీష్‌రావు
ప్రతిపాధనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశం
సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 10: కలియుగ ప్రత్యక్ష ద్కెవంగా కొలిచే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలో ఏర్పాటుకానుందని మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్ధిపేటలోని కోమటిచెరువు ప్రాంతంలో తిరుపతి వెంకటేశుడు కొలువుదీరనున్నట్లు చెప్పారు. ఈ మేరకు మంగళవారం తిరుమల తిరుపతి వెళ్లిన హరీష్‌రావు నూతనంగా ఏర్పాట్కెన టిటిడి బోర్డు ఛ్కెర్మన్ బొల్లినేని రాజగోపాల్ నాయుడు (బిఆర్.నాయుడు)ని కలిశారు. సిద్ధిపేటలోని కోమటిచెరువు ప్రాంతంలో టిటిడి ఆధ్వర్యంలో వెంకటేశ్వర దేవాలయ నిర్మాణం చేపట్టాలని కోరారు. ఆలయ నిర్మాణం కోసం సిద్ధిపేట కోమటి చెరువు ప్రాంతంలో 5ఎకరాల 10 గుంటల స్థలాన్ని మంజూరు చేశామని చెప్పారు.
గతంలోనే టిటిడి ఇంజనీరింగ్ అధికారులు, స్థపతి పర్యటించి ఆలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారన్నారు. దానికి అనుగుణంగా ఆలయ నిర్మాణ నమునా, డిజ్కెన్స్‌ను రూపొందించారని ఛ్కెర్మన్‌కు ఎమ్మెల్యే హరీష్‌రావు వివరించారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ప్రజలు ఇష్ట ద్కెవంగా.. ఇలవేల్పుగా కొలుస్తారని, అలాంటి ఆలయాన్ని సిద్ధిపేటలో నిర్మించడం గొప్ప అదృష్టమన్నారు. వొచ్చే టిటిడి బోర్డు మీటింగ్‌లో సిద్ధిపేటలో వెంకటేశ్వర దేవాలయ నిర్మాణానికి ఆమోదం తెలిపి, మీరే (బిఆర్.నాయుడు) ఆలయ నిర్మాణ పనుల శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా కోరారు. అందుకు ఛ్కెర్మన్ బిఆర్.నాయుడు సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత చీఫ్ ఇంజనీర్ అధికారి, సంబంధిత అధికారులను పిలిచి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇక సిద్ధిపేటలో టిటిడి వెంకన్న ఆలయం నిర్మాణం కానున్నందున ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే హరీష్‌రావుకు, టిటిడి ఛ్కెర్మన్ బిఆర్.నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.