కేటీఆర్‌కు ఏసీబీ నోటీసుపై కవిత స్పందన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13 : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ విభాగం శుక్రవారం నోటీసు జారీ చేయడంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చారంటూ ఏసీబీ చర్యను ఖండిరచారు. రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ ద్వారా మళ్లీ నోటీసులు జారీ చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మీరు ఎన్ని కుట్రలు పన్నినా మీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగడతామని హెచ్చరించారు.