ఏసీబీ నోటీసులివ్వడంపై కేటీఆర్ స్పందన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13: ఫార్ములా ఈ-రేస్ కేసులో తనకు ఏసీబీ విభాగం నోటీసులు ఇవ్వడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా తాను సోమవారం ఉదయం 10 గంటలకు దర్యాప్తునకు హాజరవుతానన్నారు. ఏసీబీ అధికారులకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ‘నేను నగదు బ్యాగులతో దొరికిన దొంగను కాదు.. నాతోపాటు న్యాయమూర్తి, మీడియా సమక్షంలో లై డిటెక్టర్ పరీక్షలో పాల్గొనే ధైర్యం రేవంత్‌కు ఉందా అంటూ ఆయన సవాల్ విసిరారు. పదేపదే విచారణలతో ప్రజాధనం ఎందుకు వృథా చేస్తారంటూ తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో ప్రశ్నించారు. ఫార్ములా ఈ-రేస్ కేసుకు సంబంధించి ఈనెల 16న (సోమవారం) ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాల్సిందిగా ఏసీబీ నోటీసుల్లో పేర్కొంది.