ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఆర్థిక వ్యవస్థ పురోగతి
ఇతర నగరాల కన్నా హైదరాబాద్‌లో 56 శాతం వృద్దిరేటు
సిటిజన్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్15: గ్లోబల్ బిజినెస్ హబ్‌గా హైదరాబాద్ మారిందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఇక్కడ కమర్షియల్ స్పేస్‌కు డిమాండ్ బాగా పెరిగిందని చెప్పారు. అమెరికాకు చెందిన సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో సిటిజన్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌ను మంత్రి ప్రారంభించిన సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడారు. దిల్లీ, చెన్నైలాంటి మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో 56 శాతం వృద్ధి రేటు ఉంది. ఈ క్రమంలో తెలంగాణ దేశంలో 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదిగేందుకు చేస్తున్న ప్రయత్నానికి దోహదపడుతుందని మంత్రి అన్నారు. ప్రస్తుతం బలమైన ప్రభుత్వ ప్రైవేటు- భాగస్వామ్యంతో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు సాగుతోందని ఆయన వెల్లడించారు. గతేడాది రిటైల్ రంగంలో 1.8 మిలియన్ చదరపు అడుగుల స్పేస్‌ను సంస్థలు లీజుకు తీసుకున్నాయి.
ఆమ్జెన్, గ్లోబల్ లాజిక్, ఎలీ లిల్లీ, మారియట్, సిగ్నాలాంటి అంతర్జాతీయ సంస్థలు నగరానికి వచ్చాయి. ఏడాది వ్యవధిలో 70కి పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌లు ఏర్పాటయ్యాయి. 2030 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటు-ంది. పెట్టు-బడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లఁ్‌యం. అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు దుష్పచ్రారం చేస్తున్నాయి. ప్రభుత్వంపై నమ్మకంతో పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని శ్రీధర్‌బాబు అన్నారు. అమెరికాకు చెందిన ఫైనాన్షియల్ సేవల దిగ్గజం సిటిజన్ ఫైనాన్షియల్ గ్రూప్ తాజాగా హైదరాబాదులో టెక్ కంపెనీ కాగ్నిజెంట్ తో జతకట్టి తన గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇది హైదరాబాదులోని కాగ్నిజెంట్ క్యాంపస్ లోపలే ఉంటుందని కంపెనీ పేర్కొంది. వాస్తవానికి ఇదొక ఇన్నోవేషన్ హబ్ మాదిరిగా వర్క్ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ జీసీసీ ఏర్పాటు- ద్వారా మార్చి 2026 నాటికి కొత్తగా 1000 హై వ్యాల్యూ కలిగిన ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని వెల్లడించాయి.
ఈ సెంటర్ బ్యాంకింగ్ సంస్థలకు రానున్న కాలంలో థర్డ్ పార్టీ సంస్థలపై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని జీసీసీ పేర్కొంది. హైదరాబాద్‌లో దాదాపు 57,000 మంది సిబ్బందిని కలిగి ఉన్న కాగ్నిజెంట్, దాని ప్లాట్‌ఫారమ్‌లైన న్యూరో, సోర్స్‌లను ఉపయోగించి సిటిజన్స్ జీసీసీకి అదనపు శక్తిని ఇవ్వనుంది. అలాగే క్లౌడ్, డేటా, సైబర్ సెక్యూరిటీ, ఇంటెలిజెంట్ ఆటోమేషన్ రంగాల్లో భవిష్యత్తు అవసరాలకు తగిన ఉత్పత్తులను కంపెనీ అందించనుంది. అమెరికా చెందిన సిటిజన్స్ సంస్థ, కాగ్నిజెంట్ చేతులు కలపటంపై తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగంలో ఆవిష్కరణలకు ప్రపంచ ప్రధాన కార్యాలయంగా మారిందని కాగ్నిజెంట్ ప్రతినిధి నాగేశ్వర్ చెరుకుపల్లి అన్నారు. పైగా అనేక జీసీసీల ఏర్పాటుకు హైదరాబాద్ డెస్టినేషన్ గా మారింది. ప్రస్తుతం హైదరాబాదులో అత్యుత్తమ టాలెంట్ పూల్ అందుబాటులో ఉండటమే ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలను ఆకట్టుకోవటానికి కారణంగా నిపుణులు చెబుతున్నారు.