Tag Telugu Poetry

మతోన్మాద ఉచ్చు

ఒక గంపలో రెండు కత్తులు. భక్తి – భయం తెగిపడ్డ నెత్తులు, ఈ మతోన్మాద మోదంలో నువ్వు బలిపశువ్వి. నిన్న వేరొకడు – నేడు నువ్వే, నీ ప్రశ్నలంటే భయం వాడికి. జవాబుల్లేని పేడ బుర్రవాడిది, నీ విమర్శంటే ఒళ్లంతా వణుకే. కర్షక శ్రమనెరుగని దోపిడీ దొంగే, తర్కం లేని వాడి మొఖం చూడు! సహజ…

కవితాదాహం

కవిత్వం కవులకు కలిగేదాహం ఎప్పటికీ తీరనిదాఘం కవిత్వం మనసులతొలిచే కీటకం మదులలోపుట్టే ప్రకరణం కవిత్వం ఆలోచనల పర్యావసానం భావజ్వాల బహిర్గతరూపం కవిత్వం అక్షరాల అల్లకం పదాల పేర్చటం కవిత్వం పువ్వుల హారం పరిమళ ప్రసరణం కవిత్వం తియ్యని మకరందం వీనులకు విందుభోజనం కవిత్వం అనుభూతుల అక్షరాకారం అంతరంగాల ప్రతిస్పందనం కవిత్వం అందాల ప్రదర్శనం ఆనందాల కారకం…

‌పొదుపు

కూడికలు తీసివేతలు కాదు జీవితం అంటే భాగహారాలు గుణకారాలు కూడా ఉంటాయి ఏటిలో పుణ్యం కొరకు వేసె డబ్బును లెక్కపెట్టి పెద్దలు వేయ మన్నారు పుట్టుక నుండి చచ్చేదాక లెక్కాపత్రం ఉంటుంది లెక్కల్లో జాతక చక్రం ముడిపడి ఉంటుంది… నీరున్న తొట్టిలో నీరున్నంత వరకు తొట్టి కలకల లాడుతుంది నీరు తోడతుండాలి నింపుతు ఉండాలి అలానే…

‌జీవమున్న జ్ఞాపకం

మౌనమంటించిన మనసుచితిలో ఒక్క నిప్పురవ్వ బతుకులో రాలి గాలి కెరటాలకు పగటి లోతుకు చేరి కరిగిన క్షణాలది అక్షరాలా మరణమే. జీవమున్న జ్ఞాపకమే. నిలువెత్తు నిజాన్ని మింగేసిన ఆకాశంలో మిగిలిన శూన్యంతో పోరాడిన ప్రాణం గెలుచిన కన్నీళ్ళ ఈతకు ఊహకందడం లేదు ఒడ్డు. – చందలూరి నారాయ

నడక…నడత

చలనానికి మూలమైన నడక గమ్యాన్ని చేర్చే పయనం జీవనానికి గుర్తింపైన నడత జీవితాన్ని మలిచే ప్రవర్తనం క్రమం తప్పని నడక నిలకడైన ఆరోగ్యానికి సూచిక క్రమశిక్షణ తప్పని నడత సత్ప్రవర్తనకు ప్రతీక చక్కని దారులవెంట నడిస్తే సాగుతుంది పయనం హాయిగా మంచి నడతతో జీవితాన్ని కొనసాగిస్తే గడుస్తుంది బతుకు ఉన్నతంగా నడిచే నడక ఇష్టమైనపుడు ఏ…

మొఖం సూర్యుడు

దహన సంస్కారం చేస్తున్న బూజు పట్టిన వ్యాపకాలకు హితం కోసం పాటుబడుంటే వ్యక్తిగతం పక్కన పెట్టుంటే అందరం స్వేచ్ఛా గీతాన్ని ఆలపించే వాళ్ళం అధికారం నిరంకుశత్వాన్ని పునర్నిర్మిస్తూ దేనికై పాకులాడామో మొదటికి తెస్తుంది తప్పుల కాలాన్ని వదిలి గాలిలో నడిచినందుకే శరీరాల్ని వదిలేసినందుకే బుద్ధిని నియంత్రించక ఊగిసలాడించినందుకే అవకాశం కమ్ముకొచ్చిన మేఘం కదా నిరంతర పోరాటమే…

ఎండ్ ఆఫ్ ది బిగినింగ్!

End of the beginning!

ఇక వద్దనిపిస్తుంది బలవంతంగా లాగే తరుణం చాలనిపిస్తుంది ఉంటాను తేలికపాటి రెప్పలపై వాలుతాను ఏ సన్నని తీగలపై వర్షం వెలిసిన తర్వాత కునికి పాట్లు తీస్తూ ఏ మూలనో… ఇంకా రాలేదా తలుపు తీయలేదా ఇంట్లోకి పిలవలేదా వసంతాలకై వేటలు.. వెన్నెలకై వెతలు ఎవరిని చూసినా ఏ తలం చరిచినా అవే మాటలు అవే కూతల…

జీవగర్ర

అప్పుడప్పుడు ఒంటరిగా నిలుచొని మనలోకి మనం తొంగిచూసుకోవాలి మనలోని మనసున్న మనిషి మాయమైపోతున్నాడో మనుగడ సాగిస్తున్నాడో గమనించుకోవాలి దారి తప్పుతున్నాడని పిచ్చిపరుగులు తీస్తున్నాడని మనసు అద్దం చూపిస్తే సరిదిద్దుకోవాలి మొత్తంగా మనలోని మనిషితనం కూలిపోకుండా జాగ్రత్తపడాలి మనిషితనమే జీవగర్ర అది కూలిపోయిన నాడు మనమున్నా లేనట్టే.. నడిచే శవాలమైనట్టే.. ౼ కార్తీక రాజు    హనుమకొండ…

బాబా మా సాయిబాబా

ఎవరేమై పోతే మనకెందుకు? మనకోసం బ్రతుకునంతా బలిచేసినందుకు అధికారం అసహనంతో పాశవికంగా జైలుగోడల నడుమ ఊపిరాడకుండా చేసినా ప్రజల గొంతుకై ప్రాణంగా నిలిచి ప్రశ్నిస్తూ పడుతూ లేస్తూ కదలలేని కాళ్ళతో చక్రాల బండికి పరిమితమైనా తన మాటలతో లక్షలాది మెదళ్ళను జాగృతం చేసిన వాడు అన్యాయంగా దుర్మార్గంగా పదేళ్లు అండా సెల్ నరకాన్ని చిరునవ్వులతో భరిస్తూ…