Tag Prajatantra Telugu News

వనదేవతలను దర్శించుకున్న గవర్నర్  జిష్ణు దేవ్ వర్మ

తల్లులకు నిలువెత్తు బంగారం సమర్పణ ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో కొలువుదీరిన వనదేవతలు సమ్మక్క, సారలమ్మను మంగళవారం గవర్నర్  జిష్ణు దేవ్ వర్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తల్లులకు ప్రత్యేక పూజలు చేసి  నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి సీతక్క సమ్మక్క, సారలమ్మ ల ప్రాశస్త్యం గురించి గవర్నర్ కు వివరించారు.…

కొండపర్తి గ్రామం దేశానికే రోల్ మోడల్ గా నిలవాలి

రాష్ట్రంలో ఏడు ఆదివాసీ గ్రామాలను దత్తత తీసుకున్నా.. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తాడ్వాయి మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం కొండపర్తి గ్రామం దేశానికే రోల్ మోడల్ గా నిలవాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆకాంక్షించారు. మంగళవారం కొండపర్తి గ్రామంలో గవర్నర్ పర్యటించారు.…

5 లక్షల యువతకు సర్కారు భారీ నజరానా

రాజీవ్ యువ వికాసం పథకానికి రూ.6000 కోట్లు జూన్ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ వెల్లడించిన  ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాజీవ్ యువ వికాసం ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ యువతీ యువకులకు రూ.6 వేల కోట్లతో ఐదు లక్షల మందికి స్వయం ఉపాధి పథకాలు అందిస్తామని రాష్ట్ర ఉప…

నియోజకవర్గాల పునర్విభజన అంశంపై స్పష్టత రావాలి!

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల రెండో సెషన్‌  ప్రారంభమైంది.  ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ఇప్పటికే పలు అంశాలపై విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వాటిని పార్లమెంట్‌ వేదికగా చర్చకు పట్టుబట్టే అవకాశం ఉంది. ప్రధానంగా జనగణన, అందులోనే కులగణన చేపట్టాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది. జనగణన చేపట్టేందుకు ఇప్పటికే అధికార బీజేపీ…

విద్యా ఎమర్జెన్సీ గా గుర్తించి రాష్ట్ర బడ్జెట్ లో నిధులు పెంచాలి

రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు సరిపడ నిధులు కేటాయించనందున విద్యా వ్యవస్థ ఒక పెద్ద సంక్షోభంలో ఉన్నదని గుర్తించాలి. ఈ సంక్షోభం నుండి బయట పడడానికి తల్లిదండ్రులలో ప్రభుత్వ విద్య పట్ల  సన్నగిల్లిన  విశ్వాసం పెంచడానికి  తెలంగాణ విద్యా వ్యవస్థ దుస్థితిని గుర్తించి విద్యకు 15శాతం బడ్జెట్‌ను కేటాయిస్తామన్న హామీని 2025-26 బడ్జెట్ లో కేటాయించి రాష్ట్రంలో…

ఉద్యమకారులకు దక్కిన గుర్తింపు 

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అసలైన ఉద్యమకారులకు గుర్తింపు లభించడంపై   తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. బిఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్‌ను ఎంపిక చేయగా, కాంగ్రెస్‌పార్టీ అద్దంకి దయాకర్‌కు ఎంఎల్సీ అభ్యర్థిగా టికెట్‌ ‌కేటాయించింది. వీరిద్దరూ ఉద్యమకారులే కావడంతో యావత్‌ ‌తెలంగాణ సమాజం వారికి సముచిత న్యాయం జరిగిందన్న సంతోషాన్ని వ్యక్తం…

అసెంబ్లీ సమావేశాలకు కెసిఆర్‌ హాజరు..

గవర్నర్‌ ప్రసంగం రోజు.. బడ్జెట్‌ రోజు వొస్తారు వెల్లడిరచిన వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌ :  ఈ అసెంబ్లీ సమావేశాలకు బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హాజరవుతారని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. తొలిరోజు ఉభయసభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. గవర్నర్‌ ప్రసంగానికి కెసిఆర్‌ హాజరవుతారని చెప్పారు.…

రాష్ట్రంలో ఉప ఎన్నికలు రాబోతున్నాయ్‌..

˜అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరం ˜ఫార్ములా కేసులో మళ్లీ నోటీసులు వొచ్చే అవకాశం ˜బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 10 : అబద్ధాలతో పాలన ఎక్కువ కాలం సాగించలేమని.. దానిని ప్రజలు గ్రహించినప్పుడు మూల్యం తప్పదని మాజీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతున్నాయని  తెలిపారు. అందుకే…

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, మార్చి10: యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారిని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ దర్శించుకున్నారు. వార్షిక బ్రహ్మో త్సవాల్లో భాగంగా యాగశాలలో నిర్వహి స్తున్న మహాపూర్ణాహుతికి హాజరయ్యారు. అదేవి ధంగా చక్రతీర్ధ స్నానంలో పాల్గొన్నారు. అంతకుముందు కొండపైన వీవీఐపీ అతిథి గృహం వద్దకు చేరుకున్న గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పోలీసుల గౌరవ వందనం…