Tag Life Lessons

సంసిద్ధత-లక్ష్మీ కందిమళ్ళ

దుర్మార్గం తన అడుగులను గర్జనలతో వినిపిస్తుంది. చేతుల్లోని అధికారాన్ని శాశ్వతమని భావిస్తుంది. తన నీడనే ప్రపంచమంతా కమ్మేస్తుందని అహంకరిస్తుంది. కానీ అది చూడలేని ఒక మహాశక్తి ఉంది. అదే ప్రకృతి. ప్రకృతి ఎప్పుడూ తొందరపడదు. ఎందుకంటే కాలం తన శ్వాస. ఋతువులు తన అడుగులు. సూర్యోదయం తన చిరునవ్వు. సంధ్య తన ధ్యానం. నక్షత్రాలు తన కళ్లలో…

జీవితమే నన్ను పుటం పెట్టింది

(02 ఆగస్టు 2026 న చాసో కథా పురస్కారం అందుకుంటున్న సందర్భంగా) నకజనకరి నాం.. నాం…’ సంపుటిలోని కథల నేపథ్యం? ‘నకజనకరి నాం.. నాం…’ సంపుటి గ్రామీణ దళిత స్త్రీల జీవనసత్యాల నుంచి పుట్టిన కథల సమాహారం. వలస జీవితం, ఆకలి, శ్రమ, సంప్రదాయాలు, అమాయకత్వం, మారుతున్నకాలం మధ్య గ్రామీణ ప్రజల అస్తిత్వ పోరాటమే ఈ…

“సరళ జీవితం – శాశ్వత ఆనందం”

జూలై 12 – జాతీయ సరళత దినోత్సవం: ప్రపంచం అధిక వేగంతో ముందుకు సాగుతున్నప్పటికీ, జీవితంలో సమస్యలు నానాటికీ అధిక మవుతూ, మానసిక ప్రశాంతత కోల్పోతున్న యుగంలో మనకు నిశ్శబ్దత, స్పష్టత, సరళత అత్యవసరం. ప్రతి సంవత్సరం జూలై 12న జరుపుకునే జాతీయ సరళత దినోత్సవం మనల్ని ఈ నిజాల వైపు మళ్లిస్తుంది. అమెరికన్ తాత్వికుడు,…

తీసివేతే కూడిక

మెరుపు తీగెలు -బమ్మిడి జగదీశ్వరరావు “ఇంతకీ సినిమా యెలా వుందంటావ్? హిట్టా ఫట్టా?” “హిట్టా ఫట్టాతో యేమి సంబంధం? బాక్సాఫీస్ కలెక్షన్స్ బాగుంటే సరి!” “మంచి కథేనట కదా? హీరో బాగా కష్టపడ్డాడట కూడా?” “ఈ మధ్య సినిమాలన్నీ హీరో ఎలివేషన్ల కిందపడే చచ్చిపోతున్నాయి…” “హీరో ఎలివేషన్ సరే, హీరోయినుకు ఎలివేషన్స్ యేముంటాయి?” “బాడీ ఎగ్జిబిట్…

అనుభవాలతో తడిసిన వాక్యాలు

చెమ్మ : వారాల ఆనంద్ ‘ఒక చిరునవ్వు ముందు, ఒక దయామయమైన చూపుముందు, ఒక అద్భుతమైన, ఆత్మీయ కరచాలనం ముందు ఏ పురస్కారాలు ప్రశంసలు సరిపోవు’ అని రావూరి భరద్వాజ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. తెలుగు సాహిత్యంలో సాటి మనుషుల జీవితాల్ని ఎంతో దగ్గరగా చూసి అనుభవించి రాసిన రచయితల్లో రావూరి భరద్వాజ ముఖ్యులు. ఆయన…

హృద‌యాన్ని స్పృజించే నిజ జీవిత అనుభవాలు

“డాక్టర్ పి.వి. రమేష్ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సమయంలో, గ్రామ సేవకుల (కొన్ని ప్రాంతాల్లో వీరిని ‘నీరడులు’ లేదా ‘సుంకరీలు’ అని పిలుస్తారు) వేతనాన్ని పెంచాలని కోరుతూ తాను, మరొక ప్రతినిధితో కలిసి ప్రభుత్వాన్ని ఎలా సంప్రదించారో లక్ష్మయ్య గుర్తుచేసుకున్నారు. క్షేత్రస్థాయి ఉద్యమ కార్యకలాపాలను ఉన్నత స్థాయి ప్రజా విధానాలతో అనుసంధానించడమే మల్లెపల్లి…