Tag freedom of expression

 దేశద్రోహాన్ని నిర్వచించడమెలా?!

 “ప్రజాస్వామ్యంలో అధికారాన్ని ప్రశ్నించడమే ప్రతిపక్షాల ప్రధాన బాధ్యత. అధికారంలో ఉన్నవారి తప్పులను ఎత్తిచూపడం, ప్రజలకు ప్రత్యామ్నాయ విధానాలను అందించడం, ప్రభుత్వ నిర్ణయాలపై చర్చకు పట్టుబట్టడం వాటి రాజ్యాంగబద్ధమైన హక్కు. బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలన్నీ దేశద్రోహ శక్తులేననే వాదనలో ప్రజాస్వామ్య సూత్రాలకు స్థానం లేదు. అదే ప్రమాణాన్ని గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీకి వర్తింపజేసి…

నోరు నొక్కి… అభిప్రాయం అడుగుతారా?

హైదరాబాద్ నగరాభివృద్ధిలో అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తున్న మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు ఇప్పుడు కేవలం పర్యావరణ, పునరావాస అంశాలకే పరిమితం కాకుండా తీవ్ర రాజకీయ, ప్రజాస్వామ్య చర్చకు దారితీసింది. “ప్రజాస్వామ్యయుతంగా, ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేస్తూ ముందుకెళ్తాం” అని పదే పదే ప్రకటించిన ప్రభుత్వం, తీరా క్షేత్రస్థాయిలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టే రోజున విపక్షాలు, పౌర సమాజ…

ప్రశ్నించే మహిళలపై వ్యక్తిత్వ హననమేనా?

“సంచలనం కోసం వ్యక్తిగత జీవితాలను బజారుకీడ్చడం జర్నలిజం కాదు. నిరాధారమైన ఆరోపణలకు వార్తల ముసుగు వేయడం భావప్రకటన స్వేచ్ఛ కూడా కాదు.ప్రస్తుత మీడియా పోటీలో వేగం, వీక్షకుల సంఖ్య, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం వార్తల విలువను నిర్ణయిస్తున్నాయనే ఆందోళన ఉంది. తప్పు వార్తలు వేగంగా వ్యాపిస్తాయి. వాటిని సరిదిద్దే వివరణలు మాత్రం అంతే వేగంగా ప్రజలకు…

సత్యంపై పాలకుల దండయాత్ర.. బలిపీఠంపై పత్రికా స్వేచ్ఛ!

“ఒక సమర్థవంతమైన ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే మీడియాతో ప్రభుత్వానికి ఉండే సంబంధాలు ఎప్పుడూ ఘర్షణాత్మకంగానే ఉంటాయి. అయితే గత దశాబ్దంలో విలేకరుల సమావేశాలను నిరాకరించడం, స్క్రిప్ట్ లేని సంభాషణలను అనుమతించకపోవడంతో ఈ సంబంధం మరింత దిగజారింది. ప్రభుత్వ విధానాలను విమర్శించే స్వతంత్ర మీడియా సంస్థలు ఆదాయపు పన్ను దాడులు, క్రిమినల్ కేసులు, కంటెంట్ తొలగింపు చర్యలతో మనుగడ…

దిల్లీలో ‘మోదీ సర్కార్’ అప్రకటిత ఎమర్జెన్సీ!

 “జస్టిస్ బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం “నిరసనకారులపై జరిగిన ఘటనలను తేలికగా తీసుకోం” అని తేల్చిచెప్పడం రక్షక భటుల నిరంకుశత్వానికి లభించిన తొలి చెంపపెట్టు. ఏకంగా సుప్రీంకోర్టు పరిసరాల్లోనూ సెక్షన్ 144 (బీఎన్ఎస్ఎస్ 163) విధించి, విధులకు హాజరయ్యే న్యాయవాదులను సైతం భయభ్రాంతులకు గురిచేయడం యంత్రాంగాల నియంత్రణ లేని అధికార దాహానికి అద్దం పడుతోంది. కోర్టు తక్షణమే…

భావ సంఘర్షణలు

“అక్కడి ఆంధ్ర ప్రముఖులు తెలంగాణా ప్రాంతం గురించి చులకన భావం కలిగి ఉండి తెలంగాణా వారికి తెలుగు సరిగా రాదనీ, ఉర్దూ మీడియంలో విద్యా బోధన ఉంటుంది కాబట్టి చదువుకున్న వారిలో శాస్త్ర సంబంధిత విషయ పరిజ్ఞానం తక్కువ అనీ ఇంకా ఇతర అభిప్రాయాలను వెలిబుచ్చినప్పడు పీవీ, రామానుజరావు గార్లు వారికి వాస్తవాలు సోదాహరణంగా వివరించేవారట. ఒక్కొక్క సారి…

సోషల్ మీడియా నిషేధం సాధ్యమా?

social media ban in AP

“ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రెడ్ బుక్ పేరుతో దాడులు, కేసులు ముదిరి చివరకు “ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లు” కొందరు సోషల్ మీడియా కార్యకర్తలను వెంటాడి, వేటాడి మరీ కేసులు పెట్టి జైళ్ళలో పెట్టారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సోషల్ మీడియా కార్యకర్తలు అరెస్ట్ లను తప్పుపట్టడమేకాక  సోషల్  మీడియాభావప్రకటనా స్వేచ్ఛను  అడ్డుకోరాదని స్పష్టంగా చెప్పింది.…

విమ‌ర్శ‌కుల‌పై బెదిరింపు ఆయుధం!!

BC quota is the buzzword in Telangana politics today.

ఎప్పుడైతే త‌ర్కంతో స‌మ‌ర్థించుకోవ‌డం సాధ్యంకాదో అప్పుడు విమ‌ర్శ‌కుల నోరు మూయించ‌డానికి బెదిరింపే ఆయుధంగా మారుతుంది.  ప్ర‌స్తుత పాల‌న‌కు ఈ సాధార‌ణ సూత్రం త‌ప్ప‌క వ‌ర్తిస్తుంది. అంటే ఎప్పుడైతే నాయ‌కుల వ‌ద్ద వాస్త‌వాలు కొర‌వ‌డుతాయో అప్పుడు బ‌ల‌ప్ర‌యోగానికి సిద్ధ‌మ‌వుతారు. ఎప్పుడైతే ప్ర‌భుత్వం స‌హేతుక చ‌ర్చ‌నుంచి సంస్థాగ‌త బెదిరింపు వైపు మ‌ళ్లుతుందో అది త‌న త‌ప్పును మౌనంగా అంగీక‌రించిన‌ట్టే.…

నాలాంటివాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు

 “సాహిత్యం అంటే కేవలం అక్షరాలా కూర్పు కాదు, భావాలను ప్రభావితం చేసే, మనసును మార్చే, ఆలోచనలకు ప్రేరణనిచ్చే వాస్తవికకళ!” అని ఎవరి ఫేస్బుక్ గోడ మీదనో చదివినట్టు గుర్తు. అలాగే “దేశం కోసం మరణించే వాళ్ళు వీరులు, దేశాన్ని నిలబెట్టేది సాహిత్యం.” అని మహాకవి శ్రీశ్రీ అన్నారు. ఎంత నిజం, సాహిత్యానికి ఎంత బలం వుందో కదా అనిపిస్తుంది. ఎందుకంటే అమ్ముడు పోయిన మీడియా, రాజ్యం చేతిలో కీలుబొమ్మై ఆడుతున్నచోట నేడు సాహిత్యమే ఈ ఫాసిస్ట్ ప్రభుత్వపు కపటత్వాల్ని, రహస్యాల గుట్టువిప్పి చెప్తుంది. ప్రజల్ని అదెలా దోపిడీ…