– వ్యతిరేకిస్తూ వచ్చిన పిటిషన్లు తిరష్కరణ
న్యూఢిల్లీ, మే 20 : కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. జనగణనలో కులాల లెక్కింపునకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం అనుమతి ఇచ్చింది. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ (సీజేఐ) సూర్యకాంత్, జస్టిస్ జయమల్యా బాగ్చీ, విపుల్ పంచోలీలతో కూడిన ధర్మాసనం బుధవారం కొట్టివేసింది. సంక్షేమ పథకాల అమలుకు కులగణన తప్పనిసరి అని స్పష్టం చేసింది. కుల గణన ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఈ అంశంలో కోర్టుల జోక్యం ఉండదని స్పష్టం చేసింది. వెనుకబడిన తరగతికి చెందిన వారు ఎంతమంది ఉన్నారో ప్రభుత్వం తెలుసుకోవాల్సి ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





