దండకారణ్యానికి దూరమవుతున్న మావోయిస్టులు
ఒక్కొక్కరుగా కీలక నేతలను కోల్పోతున్న పార్టీ..
భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 22 : తెలం గాణకు సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల కాలంలో పెద్ద సంఖ్యలో భద్రత బలగాలు దండకారణ్యాన్ని చుట్టుముట్టి మావోయిస్టులను ఏరి వేసే పనిలో పడ్డారు. దీని కారణంగా కొద్ది నెలలుగా మావోయిస్టు పార్టీ తీవ్రంగా నష్టపో యింది. 2024 జనవరి నుంచి డిసెంబర్ వరకు సుమారు గా 280 మంది మావోయిస్టులను భద్రత బలగాలు హతమార్చాయి. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో తరచూ భద్రత బలగాలకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో భద్రత బలగాలు కొద్దిమందికి గాయాలు కావడం… మావోయిస్టులు పదుల సంఖ్యలో మృతి చెందుతున్నారు. మృతి చెందిన మావోయిస్టులలో కేంద్ర, రాష్ట్ర కీలక పదవుల్లో ఉన్నవారే.. వ్యూహ రచనలు చేయటంలో పట్టుసాధించిన మావోయిస్టు నాయకులు ఇటీవల కాలంలో మృత్యువాత పడ్డారు.
కీలక నేతల్లో సుమారు 40 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతి చెందినవారిలో అధికంగా మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు కావడం విశేషం. తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి మావోయిస్టులు పార్టీలో ఉద్యమం వెళ్ళినవారే అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు మృతి చెందినవారిలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన బడె చొక్కారావు అలియాస్ దామోదర్, భూపాలపల్లి జిల్లాకు చెందిన సాంబయ్య, హన్మకొండ జిల్లా తారాలపల్లికి చెందిన మోడెం బాలకృష్ణ, ములుగుజిల్లా వెంకటాపురం మండలంలోని లక్ష్మీదేవపేటకు చెందిన వాసుదేవరావు అలియాస్ ఆశన్న, భూపాలపల్లి చిట్యాల మండలానికి చెందిన గాజర్ల రవి, హన్మకొండ జిల్లా తారలపల్లికి చెందిన సాంబయ్య తదితర మావోయిస్టు పార్టీ కీలక నేతలు కేంద్ర, రాష్ట్ర కీలకపదవుల్లో ఉన్నారు.
మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి, ఒడిశా రాష్ట్ర మావోయిస్టు పార్టీ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన అనేక దాడుల్లో ప్రధాన పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. అతనిపై కేంద్ర ప్రభుత్వం రూ.కోటి రివార్డు కూడా ప్రకటించింది. కీలక నేతలతో పాటు సాధారణ పదవుల్లో ఉన్న మావోయిస్టులు కూడా భద్రత బలగాల చేతిలో మృతి చెందడంతో మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. మావోయిస్టులు ఇటీవల కాలంలో వందల సంఖ్యలో మృతి చెందడంతో మావోయిస్టు పార్టీలో ఉన్న క్యాడర్ పోలీసుల వద్ద లొంగిపోతున్నట్లు కూడ తెలుస్తుంది. పోలీస్ వ్యవస్థ ఛత్తీస్‌గఢ్ దండకారణ్యాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడంతో తెలంగాణ రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలోకి వస్తున్నట్లు తెలిసింది. 2023 వ సంవత్సరంలో కేవలం సుమారు 60 మంది మావోయిస్టులు మాత్రమే పోలీసుల కాల్పులకు మృతి చెందారు. 2024వ సంవత్సరంలో అధికంగా 280 మంది మృతి చెందినట్లు సమాచారం. 2025 జనవరి ముగియక ముందే 45 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తుంది.

మరికొంతమంది కీలక పదవుల్లో ఉన్నవారు వయసు రీత్యా ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుంది. సేఫ్ జోన్ అనుకున్న ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం ఇప్పుడు మావోయిస్టులకు ప్రమాదకరంగా మారింది. తరచూ పోలీస్ బలగాలు దండకారణ్యాన్ని జల్లెడ పట్టడం వలన ఆ ప్రాంతం అంతా తీవ్ర భయానక వాతావారణం నెలకొంది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో నివశించే వారు వివిధ ప్రాంతాలకు వెళ్ళి జీవనం సాగిస్తున్నారు. అటు మావోయిస్టులతోను ఇటు పోలీసులతోను ప్రజలు ఇబ్బంది పడుతూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాన్ని విడిచిపెట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో అనేక పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందోనని సామాన్య ఆదివాసీలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
వ్యూహరచనలో చలపతి దిట్ట
సోమవారం అర్ధరాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఒడిస్సా రాష్ట్ర మావోయిస్టు పార్టీ చీఫ్ చలపతి వ్యూహరచన చేయటంలో చాకచక్యంగా పనిచేసేవాడిగా మావోయిస్టు పార్టీలో పేరున్నట్లు తెలుస్తుంది. గతంలో అలిపిరి ఘటనలో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తుంది. చలపతి అసలుపేరు జయరాం రెడ్డి, జయరాం, ఆ తరువాత చలపతిగా పిలిపించుకుంటూ మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఎదిగినట్లు తెలుస్తుంది. ఇతని భార్య అరుణ మావోయిస్టు పార్టీలోని కీలక పదవిలో ఉన్నారు.
సోమవారం అర్ధరాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ఒడిస్సా రాష్ట్ర మావోయిస్టు పార్టీ చీఫ్ చలపతి వ్యూహరచన చేయటంలో చాకచక్యంగా పనిచేసేవాడిగా మావోయిస్టు పార్టీలో పేరున్నట్లు తెలుస్తుంది. గతంలో అలిపిరి ఘటనలో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తుంది. చలపతి అసలుపేరు జయరాం రెడ్డి, జయరాం, ఆ తరువాత చలపతిగా పిలిపించుకుంటూ మావోయిస్టు పార్టీలో కీలక నేతగా ఎదిగినట్లు తెలుస్తుంది. ఇతని భార్య అరుణ మావోయిస్టు పార్టీలోని కీలక పదవిలో ఉన్నారు.