మనిషి సంఘజీవి” అని అరిస్టాటిల్ అన్నాడు మనిషి సమిష్టిగా తప్ప మరోలా జీవించలేదు కనుక సమాజంలోని ప్రజలందరిపై సామాజిక ప్రభావం వుండటం సహజమూ తప్పనిసరి విద్యార్థి యువత పైన సమాజం తీవ్ర ప్రభావాన్ని ప్రసరిస్తుంది. విద్యార్థి యువతమీద వర్తమాన సమాజ ప్రభావాన్ని మనం అర్థం చేసుకునే ముందు విద్యార్థి యువత కుండే ప్రత్యేక లక్షణాలను అర్థం చేసుకోవడం అవసరం ప్రతి వ్యక్తి జీవితంలోనూ యవ్వనం అతి ముఖ్యమైన దశ ఈ దశలో మనుషులు జవజీవాలతో తోణికిసలాడుతుంటారు పతి కొత్త విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి ఆర్తిలనుకలిగి వుంటారు నిష్పక్షపాతంగా నిష్కపటంగా వ్యవవారిస్తారు అసాధ్యమూ కష్టమూ అనుకున్న పనులన్నిటిని సాధించాలని వువ్విళ్ళురుతుంటారు ఈ ప్రయత్నంలో ఎన్ని త్యాగాలనైనా చేయటానికి సిద్ధపడతారు ప్రపంచాన్నీ దేశాన్నీ సమూలంగా మార్చే బావాలను త్వరగా స్వీకరించి సొంతం చేసుకుంటారు అలాంటీ బావాలను వారే ఆవిష్కరి స్తారు కూడా తమ శక్తి సామర్థ్యాలతో అద్భుతాలను సాధిస్తారు ప్రపంచ చరిత్రలో విద్యార్థి యువత ప్రధాన పాత్ర వహించని ఏ ప్రగతిశీల ఉద్యమం జరగలేదంటే అతిశయోక్తి కాదా బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన స్వార్థకస్ అతడి అనుచరులు విద్యార్థి యువతీ యువకులే ప్రపంచంలో భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా సాగిన ఇంగ్లీష్ పెంచ్ విప్లవ పోరాటాలలో ముందు వరుసన నిలిచింది.
విద్యార్థి యువతే మార్క్స్ స్టు సిద్ధాంత ఆవిష్కరలైన కారుల్ మార్క్స్ ఫ్రెడరిక్ ఏంగిల్స్ తమ ముఖ్యమైన సిద్దాంత ప్రతిపాదనలను కమ్యూనిస్టు ప్రణాళికా రచనలను 30 ఏళ్ళు వయస్సులోవూరి చేశారు అమెరికారష్యా చైనాఉత్తరకొరియాక్యూబాఇండోవిప్లవపోరాటాలలో విద్యార్థి యువతే ప్రధాన పాత్ర పోషించింది వీటికి నాయకత్వం వహించింది ఉడుకు రక్తం ఉరకలేసే విద్యార్థి యువతీ యువకులే ఈ విప్లవాల నాయకులు వాషింగ్టన్ లెనిన్ స్టాలిన్ మావో కిమ్ఇల్- సంగ్ పైడల్ కాస్టో చేగువేరా హూచిమన్ మొదలైన వారు తమ యవ్వన దశలోనే తమ దేశాల విప్లవ పోరాటాలకు నాయకత్వం వహించారు ప్రపంచంలో జరిగిన అనంఖ్యక సంస్కరణ ఉద్యమాలకు నాయకత్వం వహించిన వారు నూతన శాస్త్రీయ ఆవిష్కరణలు చేసినవారు విద్యార్థి యువజనులే బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా సాగిన ప్రధమ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని అనువులర్చించిన ఝాన్సీ లక్ష్మీబాయి మొదలైనవారు విద్యార్థి యువతరానికి చెందినవారే జాతీయ విమోచనా పోరాటాలలో నాయకత్వ పాత్ర వహించిన కాకూరీ చిట్టగాంగ్ కుట్ర కేసుల వీరులు గద్దర్ వీరులు దేశ ప్రజలందరికీ ఈనాటికి ఆదర్శంగా నిలిచిన త్యాగమూర్తులు సర్దార్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ అల్లూరి సీతారామరాజు తదితరులంతా నూనూగు మీసాలవిద్యార్థి నవ యవ్వనులే భారత స్వాతంత్రోద్యమ నాయకులై ఆజాద్ బోస్ లూ విద్యార్థి యువకులే ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులూ నావికా సైన్యం తిరుగుబాటు యోధులూ విద్యార్థి యువతీ యువకులే నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన విరోచిత తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన అందులో ప్రాణాలు కోల్పోయిన వేలాది వీర కిశోరాలువిద్యార్థి యువజనులే అధికార మార్పిడి తరువాత భూస్వామ్య విధానాలకి వ్యతిరేకంగా సాగిన నక్సల్బరీ శ్రీకాకుళం నేడు దండకారణ్యంలో మొదలైన సాయుధ పోరాటాలకు నాయకత్వం వయిస్తున్న వారు ఆ పోరాటాలలో అమరులైన వారూ విద్యార్థి యువకిశోరాలే పరస్పర విరుద్ధ వర్గాలుగా విడిపోయి ఉన్న సమాజంలో ఏదో ఒక వర్గం ఆధిపత్యం స్థానంలో వుంటుంది మరో వర్గం ఆధీన స్థానంలో వుంటుంది ఆధిపత్యంలో వున్న వర్గం ఉత్పత్తి విధానాలపై ఆధిపత్యాన్ని కలి వుంటుంది రాజ్యం మీద ఆధిపత్యాన్ని కలి వుంటుంది పర్యవసానంగా అది ప్రజల ఆలోచనా విధానాన్నిసంస్కృతిని కూడా శాసిస్తుంది ప్రస్తుతం నేడుమనదేశంలో భూస్వామ్య పెట్టుబడిదారీ సామ్రాజ్యవాదం ఉత్పత్తి విధానాల కలిగిలిన వున్నాయి.
భూస్వామ్యం భావజాలమూ సంస్కృతి మనధర్మం సాంప్రదాయాల ద్వారా సామాజిక కట్టుబాట్లు ద్వారా అమలవుతూ వుంటే పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద భావజాల సంస్కృతి చట్టం ప్రకారం రాజ్యాంగం ప్రకారం అమలవుతున్నాయి నేడు విద్యా కాసాయికరణను విద్యా వ్యవస్థ ద్వారా అమలవుతున్నది. ఈ వ్యవస్థలో దోపిడీ అంచివేతలకు గురవుతున్న కార్మిక వర్గం రైతాంగంఆదివాసులు యితర మధ్యస్త వర్గాలు ఈ ఆధిపత్య విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. రెండు వర్గాలూ విద్యార్థుల యువతను గెలుచుకోవటానికి తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి ఆధక్యస్థానంలో వున్న వర్గం యొక్క ప్రభావం అంటే పెట్టుబడుదారి సామ్రాజ్యవాద సంస్కృతి ప్రభావం ఆత్యదికంగావుండటం స్వాబావికమే సమాజంలోని మెజారిటీ ప్రజలు విద్యార్థియువత దోపిడివ్యవస్థలో చాలా కాలం వరకు తమ వర్గ ప్రయోజనాలకు వ్యతిరేకమైన భావజాలంతో ప్రభావితులతారు. పెట్టుబడిదారీఆర్థిక సిద్ధాంతం ప్రకారంసమాజంలోని వ్యక్తులు ఎవరి స్వార్ధాన్ని వాళ్ళు చూసుకుంటే సమాజహితానికి తోడ్పడుతుంది ఉత్పత్తి సాధనాలు వ్యక్తిగత ఆస్తిగా వుండే హక్కు పెట్టుబడిదారులు పోటీపడి లాభాలను గడిష స్థాయికి తీసుకుపోయే హక్కు వారి దృష్టిలో “నిజమైన” ప్రజాస్వామ్యానికి ప్రతిపాదనలు ఏమైనా చేసి ఆస్తులు పెంచుకోవాలి లాభాలు పెంచుకోవాలి అనే భావాలను విద్యార్థి యువత మెదళ్ళలో నాటుతారు ఎంత ఆస్తి సంపాదిస్తే అంత సమర్థుడు ఎంత డబ్బు సంపాదిస్తే అంత గౌరవనీయుడు అనే భావాలను నాటుతారు అవే భావాలను వ్యాప్తి చేస్తారు శ్రమజీవులను పేదలను హినంగా తేలిగా చూసే ధోరణినిపిసోందిస్తారు.
ఈ భావాలు విద్యార్థి యువతను ఎక్కువ సంపాదన కోసం ఏ అడ్డదారులైన తొక్కేలా ప్రోత్సహిస్తుయి చివరికి భయంకరమైన నేరస్తులుగా తయారుచేస్తాయి విలాసవంతులుగా మార్చి వేస్తాయి భూస్వామ్య సామ్రాజ్యవాదం సంస్కృతి పిత్రసామిక వ్యవస్థ స్త్రీని హీనంగా చూసే పురుషుడికి బానిస ఆస్తి అనే భావజాలాన్ని పెంపొందింసే పెట్టుబడిదారీ మనుధర్మ సంస్కృతి స్త్రీని పురుషుడి విలాస వస్తువు అనే భావానను విద్యార్థి యువత మెదళ్ళ కిక్కస్తుంది. ఇటీవల కాలంలో వరకట్న వేధింపులు ఎక్కువవడం మనం చూస్తున్నాం స్త్రీలు ఉద్యోగాలుచేస్తున్న పని స్థలాలలో వేధించడం సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న విద్యార్ది యువకులు కూడా తమ భార్యలను వేధింపులకు చిత్రహింసలకు గురి
చేస్తున్న వార్తలు వింటున్నాం వినియోగదారీ పితృస్వామిక భావజాలం వల్ల ఈ సంఘటన సంభవిస్తున్నాయి.
తల్లిదండ్రులను ఇతర కుటుంబ సభ్యులను పట్టించుకోక పోవడం సర్వసాధారణమై పోయింది ఎంతోమంది వయో వృద్ధులు పిల్లలు గాలికొదిలేస్తే దయనీయమైన జీవతలను గడుపుతున్నారు ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నమయిపోతున్నాయి స్థోతత లేని తల్లిదండ్రులను పట్టించుకోనివారు కొందరైతే ఆర్థికంగా ఉన్నత స్థానంలో వున్న స్వార్థం సంకుచితత్వం కారణంగా చూడని వారు కొంత మంది సమాజంలో వర్గ వైరుధ్యాలు తీవ్రం కావడం వల్ల వివిధ తరగతుల ప్రజలు దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా వారి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అంతకంతకూ పోరాటాలతోముందుకు వస్తున్నారు పాలకుల విధానాల వల్ల ఈ వర్గ వైరుధ్యాలు మరింత తీవ్రమయ్యాయి దారిద్ర్యం నిరుద్యోగం అసమానతలు తీవ్రమయ్యాయి ఇంతరత్రా ప్రజల జీవన పరిస్థితులు క్షిణంచాయి పర్యవసానంగా వివిధ వర్గాల శ్రామికప్రజలపోరాటాల్లోకి వస్తున్నారు వీరికి అత్యధికులు విద్యార్థి లు యువతి యువకులే సమాజంలోనిఅన్నిరకాలచెడుగులనుతరుమడంలోనూ దోపిడీ వ్యవస్థను నిర్మూలించడంలోను ప్రజలందరూ జీవించే హక్కు కోసం సమసమాజ సమాజాన్ని స్థాపించడంలోనూ గురుతరమైన పాత్రను విద్యార్థి యువతీ యువకులు నిర్వహిస్తారనటంలో సందేహం లేదు ఇలాంటి యువత మహాకవి శ్రీశ్రీచెప్పినట్టు “రాబోవు యుగం దూతలు నవ జీవన బృందావన నిర్మాతల ” అనటంలో అతిశయోక్తి యెంత మాత్రం లేదు
శోభరమేష్
కాకతీయ విశ్వవిద్యాలయం
8978656327





