– శిక్షణను పూర్తి చేసిన అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్డోబర్ 31: హైదరాబాద్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) ఆధ్వర్యంలో వారధి ట్రస్ట్ సహకారంతో ఉద్యోగావకాశాలతో కూడిన నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, న్యాక్ వైస్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సివిల్ సూపర్వైజర్, ఎలక్ట్రీిషియన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, శిక్షణతోపాటు ఉచిత భోజనం, నివాసం, వసతి సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫి˜కెట్‌తోపాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం నవంబర్ 3వ తేదీ నుండి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్), హైదరాబాద్‌లో ప్రారంభమవుతుందని మంత్రి తెలిపారు. శిక్షణకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నంబర్లు: 8008937800/9032504507.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





