– స్వయంగా డ్యామ్‌ను సందర్శిస్తా
– భూసేకరణకు రూ.5000 కోట్లు
– జూన్ 2 నాటికి భూసేకరణ పూర్తి
– పాలెం వాగు ప్రాజెక్టు గేట్లు, రెగ్యులేటర్ సమస్యలను పరిష్కరిస్తా
– ప్రాజెక్టు పరిస్థితిని క్షేత్రస్థాయికి వెళ్లి సమీక్షించండి
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4 సింగూర్ డ్యామ్ భద్రత ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యమని నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ మహానగరానికి ప్రాణాధారంగా నిలిచిన ఈ ప్రాజెక్టు పరిరక్షణకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటుందని తెలిపారు. స్వయంగా తాను ప్రాజెక్టును సందర్శించి పరిస్థితిని పూర్తిస్థాయిలో సమీక్షిస్తానని ఆయన ప్రకటించారు సహచర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దనసరి అనసూయ సీతక్క, వివేక్ వెంకటస్వామిలతో కలిసి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయంలో ఆయన నీటిపారుదల శాU ఇంజినీర్లతో బుధవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జంట నగరాలకు తాగునీటిని సరఫరా చేస్తూ పరిసర ప్రాంతాలకు సాగునీరు అందిస్తున్న సింగూర్ ప్రాజెక్టును పరిరక్షించడంతోపాటు పునరుద్ధరణ విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదని స్పష్టం చేశారు. జాతీయ ఆనకట్ట భద్రతా సంస్థతోపాటు రాష్ట్ర అధికారుల నుంచి భద్రతా పరిస్థితిపై హెచ్చరికలు వచ్చినట్టు పేర్కొన్నారు. ప్రమాదాలను నివారించేందుకు తక్షణ సాంకేతిక జోక్యాలు, అండర్‌వాటర్ పరిశీలనలు, మరమ్మతు పనులను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు. ఆనకట్ట భద్రతా చర్యలు సంగారెడ్డి జిల్లాలో ఉన్న సింగూర్ డ్యామ్ (ఎం.బాగారెడ్డి సింగూర్ ప్రాజెక్టు)పై 2025 మధ్యకాలం నుంచే ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఆ సమయంలో నిర్వహించిన అంచనాల్లో ఎంబాంక్మెంట్‌లో చీలికలు, స్లోప్ ఎరోషన్, రివిట్‌మెంట్ నష్టం, ప్లంజ్ పూల్ సమస్యలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఇవి దిగువ ప్రాంతాల్లో వరద ముప్పుకు దారితీసే అవకాశాలపై ఆందోళనలు రేకెత్తించాయన్నారు. 29.91 టీఎంసీల స్థూల సామర్థ్యం గల ఈ రిజర్వాయర్ ప్రతీ సంవత్సరం హైదరాబాద్‌కు 6-7 టీఎంసీల నీటిని సరఫరా చేస్తోందని తెలిపారు. డ్యామ్ భద్రత పూర్తి బలోపేతం జరిగే వరకు అధిక ప్రమాదం కలిగించే ఆపరేషన్లు నిలిపివేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బండ్ దిగువన నీటిని పూర్తిగా వదలకుండా దాగి ఉన్న నష్టాలను గుర్తించేందుకు సోనార్ పరీక్షలు, అండర్‌వాటర్ సర్వేలు చేపట్టి 2-3 రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. త్వరలోనే స్వయంగా ఆనకట్టను సందర్శిస్తానని ప్రకటించిన ఆయన ఒకే సీజన్‌లో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. పంటల విరామం రాకుండా చూడాలన్నారు. ఇదే సమయంలో సింగూర్ కాలువ లైనింగ్ పనుల పురోగతిని కూడా సమీక్షించారు. మొత్తం 13 కి.మీలలో 9 కి.మీ పూర్తవగా మిగిలిన 4 కి.మీను అత్యవసరంగా పూర్తిచేయాలని ఆదేశించారు.
దీర్ఘకాలిక భద్రతా చర్యలు
2025 ఆగస్టులో నిల్వలను భద్ర పరిమితులకు కట్టడి చేసి నియంత్రిత నీటి విడుదల ప్రారంభించినప్పుడు ఆనకట్టపై ముప్పు స్థాయి పెరిగిందని, డిసెంబర్ నాటికి దశలవారీగా నీటిమట్టాన్ని తగ్గించి ప్రధాన మరమ్మతులు చేపట్టినట్లు వివరించారు ‘సింగూర్ డ్యామ్ భద్రత రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రధాన్యమైనదని, ఇది ప్రజల ప్రాణాలను, జీవనోపాధిని, హైదరాబాద్ నీటి భద్రతను కాపాడుతున్నందున భద్రత ఏర్పాట్లకు త్వరితగతిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తవమ్ పునరుద్ఘాటించారు. ములుగు జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. అదేవిధంగా పాలెం వాగు గేట్లు, రెగ్యులేటర్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. పాలెంవాగు పరిస్థితిని క్షేత్రస్థాయిలో పర్యటించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నివేదికను సమర్పించాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు.
భూసేకరణకు రూ.5,000 కోట్లు
రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన భూసేకరణకు ప్రభుత్వం 5,000 కోట్లT విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. జూన్ 2వ తేదీ వరకు భూసేకరణ పూర్తి చేయాలని, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు.
——————————————————————————————————————————————————————————————-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





