-నర్స్ కాన్పు చేయడంతో తల్లీబిడ్డ మృతి
భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, జూన్ 17: జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌లో దారుణం జరిగింది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఓ నర్సు కాన్పు చేసింది. కానీ ప్రసవం అనంతరం తల్లీబిడ్డ మృతిచెందారు. గుండాల మండలం శంభునిగూడెం గ్రామానికి చెందిన గర్భిణి వనజ (20)కు పురిటినొప్పులు రావడంతో గుండాల ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. అయితే ఆ సమయంలో హాస్పిటల్‌లో వైద్యులు అందుబాటులో లేరు. దీంతో అక్కడ ఉన్న నర్స్ సాధారణ ప్రసవం చేసింది. కానీ కాన్పు తర్వాత శిశువు అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఇల్లెందు ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. అక్కడ నవజాత శిశువును పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లుగా తెలిపారు.మరోవైపు కాన్పు అనంతరం తల్లికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స పొందుతూ ఆమె కూడా మరణించింది.ఈ ఘటనపై బాధిత కుటుంబం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె, మనమడు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




