హరహర మహదేవ

˜వేములవాడలో శివరాత్రి కోలాహలం
˜భారీగా తరలివొచ్చిన భక్తజనం
˜స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన కేంద్ర మంత్రి బండి
˜రాజన్న సేవలో ఎమ్మెల్యే ఆదిశ్రీనివాస్‌

సిరిసిల్ల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 :  మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలో అతిపెద్ద శ్కెవక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ భక్తులతో  కిక్కిరిసిపోయింది. మూడు లక్షల కుపైగా  భక్తులు రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వేములవాడకు విచ్చేయడంతో అన్ని రోడ్లు, ఖాలీ స్థలాలు, వీధులు నిండిపోయాయి. వేలాది భక్తులు మంగళవారం రాత్రి నుంచే ఇక్కడికి చేరుకున్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు శ్రీస్వామివారిని దర్శించుకోవడానికి, కోడె మొక్కులు చెల్లించు కోవ డానికి క్యూల్కెన్లలో బారులు తీరారు. ఈ భక్తులంతా స్వామివారిని దర్శించుకోవడానికి కనీసం 7 గంటల  పాటు క్యూల్కెన్లలో వేచి ఉండాల్సి వొచ్చింది. మహాశివరాత్రి  సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అలాగే ఎమ్మెల్సీ కవిత, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ రaా, అఖిల్‌ మహాజన్‌ స్వామివారిని దర్శించుకున్నారు.

మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, జిల్లా బిజెపి అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు  నాగుల సత్యనారాయణ, సంగీతం శ్రీనివాస్‌ ,రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణలు దర్శించుకున్నారు.
సాయంత్రం ఆరు గంటలకు స్వామివారి కల్యాణ మండపంలో  స్థానాచార్య నమిలికొండ ఉమేశ్‌ శర్మ, ప్రధానార్చకులు సురేశ్‌, శరత్‌, నమిలికొండ రాజేశ్వరశర్మ తదితర వేదపండిల అధ్వర్యంలో మహాలింగార్చనను, అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఇదే సమయంలో వేలాది భక్తులు ఆలయ ఆవరణలో, తాము బస చేసిన స్థలాల్లో జాగరణలు చేయగా, భాషా సాంస్క్కతిక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి నుండి గురువారం  వేకువ జాము వరకు శివార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

మహాశివరాత్రి సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు, పోలీసు అధికారుల కుటుంబ సభ్యులు వందలాది మంది విఐపి దర్శనాల పేరిట ఆలయంలోకి ప్రవేశించడంతో సాధారణ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి, దేవస్థానం అధికారులు, పోలీస్‌ అధికారులకు వ్యతిరేకంగా నినదించారు. సాధారణ భక్తులు అనేక పర్యాయాలు పోలీస్‌ సిబ్బందితో వాగ్వాదాలకు దిగారు. చివరకు పోలీస్‌ సిబ్బంది అతిగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కు విన్నవించారు..పెస్టివల్‌ కమిటీ సభ్యులు సైతం పోలీసుల తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేసి ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌కు విన్నవించగా ఆయన పోలీస్‌ సిబ్బందిని తగిన సూచనలిచ్చారు. ఒక దశలో దేవస్థానానికి నాలుగు వైపులా ఉన్న గేట్లను పోలీసులు మూసివేయడంతో స్థానికులు,పెస్టివల్‌ కమిటీ సభ్యులు నిరసన వ్యక్తం చేయడంతో వాటిని పోలీసులు తెరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page