హైదరాబాద్, ప్రజాతంత్ర,అక్టోబర్23: హైదరాబాద్ నుంచి షిర్డీ క్షేత్రానికి రోజూ వేలాదిమంది సాయిబాబా భక్తులు వెళ్తుంటారు. సాయిబాబా దర్శనం కోసం వెళ్ళే భక్తులు బస్సులు, రైళ్లు, టూరిజం బస్సులు వంటి వాటిని ఎంచుకుంటారు. అయితే చాలా మందికి షిర్డీ వెళ్లాలని ఉన్నా ధర తమకు అందుబాటులో లేదు అంటూ భావిస్తారు. అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ తాజాగా బంపర్ ఆఫర్ ప్రకటించింది. తక్కువ ధరకే సాయి సన్నిధి ఎక్స్ హైదరబాద్ అనే పేరుతో ప్రత్యేక షిర్డీ టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నెలలో ప్రారంభం కానున్న ఈ టూర్ 2 రాత్రులు, 3 రోజులపాటు సాగనుంది. ప్రతి బుధవారం అందుబాటులో ఉండనున్నది. ఈ టూర్ ప్యాకేజీకి లో టికెట్స్ బుక్ చేసుకోవాలనుకునేవారు సూచించిన వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఈ నెల 29న కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి (రైలు నెంబర్ 17064) సాయంత్రం 6,40 గంటలకు స్టార్ అవుతుంది. సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ వంటి స్టేషన్ల మీదుగా ఈ ప్రయాణం సాగుతుంది. బుధవారం రాత్రి అంతా ప్రయాణం చేసి మర్నాడు మహారాష్ట్రలోని నాగర్‌సొల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. ఇక్కడినుంచి షిర్డీకి ప్రత్యెక వాహనం ద్వారా చేరుకుంటారు. రెండో రేజు ఉదయం షిర్దీలోని హోటల్‌లో చెక్-ఇన్ అవ్వాలి. అల్పాహారం తిని సాయిబాబా దర్శనం కోసం ఆలయానికి చేరుకోవాలి. సాయంత్రం 5 గంటలకు హోటల్ చెక్ అవుట్ అయ్యి రాత్రి 7.30 గంటల నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. రెండో రోజు రాత్రంతా ప్రయాణం చేసి మూడో రోజు ఉదయం 9:45కి కాచిగూడకు చేరుకోవాలి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





