-ఎమ్మెల్యేకు జీవన్ రెడ్డి చురకలు
జగిత్యాల, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: స్పీకర్ తీర్పుతో అయినా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఇక కాంగ్రెస్ జోలికి రాకుంటే మంచిదని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్‌పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు జీవన్ రెడ్డి వెల్లడించారు. బుధవారం నాడు జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ’ఎమ్మెల్యే సంజయ్ అనర్హత పిటిషన్‌పై శాసనసభ స్పీకర్ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నా. బీఆర్‌ఎస్ పార్టీలో ఉన్నా అని సంజయ్ చెప్పడాన్ని స్వాగతిస్తున్నా. సంజయ్ నీకు దొంగ బుద్ది ఎందుకు?. స్పీకర్ తీర్పుతో పద్ధతిగా ఉండు. నా కాంగ్రెస్ పార్టీలో చిచ్చుపెట్టకు. నీ బీఆర్‌ఎస్ పార్టీలో నువ్వు కరెక్ట్‌గా ఉండు. నా పార్టీ అంతర్గత విషయాల్లో ఎందుకు వేలు పెడుతున్నావు?. అభివృద్ధి అంటే పక్కింట్లోకి కన్ను వేయడమా?. గడిచిన రెండు ఏళ్లలో సీఎం రేవంత్‌తో ఉండి నువ్వు చేసిన అభివృద్ధి ఏంటీ చెప్పు.. సంజయ్?’ అని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నించారు. మరోవైపు ఏడాదిన్నర కాలంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన సంజయ్‌కు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడంపై జీవన్ రెడ్డి గతంలోనూ ఘాటుగా విమర్శించారు. తాజాగా మున్సిపల్ ఎన్నికల వేళ టికెట్ల అంశంతో ఆ విభేదాలు మరింత ముదిరినట్టు తెలుస్తోంది. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులు ఉండగా.. 29 టికెట్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గానికి, 21 టికెట్లు జీవన్ రెడ్డి వర్గానికి పార్టీ అధిష్ఠానం కేటాయించినట్లు సమాచారం. ఈ అంశం జీవన్ రెడ్డి వర్గంలో మరింత అసంతృప్తిని పెంచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





