నాదెండ్ల మృతి ఉమ్మడి ఏపీ ప్రజలకు తీరని లోటు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 23 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి భాస్కరరావు భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుమారుడు, జనసేన పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్‌ను, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భాస్కరరావు స్వర్గస్తులు కావడం బీజేపీ శ్రేణులకు, ఉమ్మడి ఏపీ ప్రజలకు తీరని లోటు అని అంటూ రెండు రాష్ట్రాలకు ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి కొనియాడారు. పార్టీలో అత్యంత క్రియాశీలకంగా ఉంటూ తన అనుభవంతో దిశానిర్దేశం చేసేవారన్నారు. తాను రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన రోజున వారు స్వయంగా వచ్చి ఆశీర్వదించారని గుర్తు చేసుకున్నారు. వారి కుమారుడు నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్నారని, ఈ కష్టసమయంలో ఆ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలని రామచందర్ రావు ప్రార్థించారు. కార్యక్రమంలో బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్, తదితరులు ఉన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *