హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 21: రైతు భరోసాలో భాగంగా కొద్దిరోజులుగా ఎకరాల వారీగా రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేస్తోంది. ఏడెకరాల వరకు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో శుక్రవారం డబ్బులు జమ అయ్యాయి. అన్నదాతలను ఆర్థికంగా ఆదుకునేందుకు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ప్రభుత్వం రూ.905.89 కోట్లు విడుదల చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తెలిపారు. శనివారం తొమ్మిది ఎకరాల వరకు పొలం ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ప్రభుత్వం ఇప్పటివరకు 66.19 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. గురువారం 4,43,167 మంది రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసింది. భూమి పరంగా 106 లక్షల ఎకరాలకు పంట సహాయం అందించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
9 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు జమ
