రూ. 600 కోట్లు లూటీకే ఫార్ములా ఈ-రేస్‌

ఈ-ఫార్ములా సంస్థతో కేటీఆర్‌ లోపాయికారీ ఒప్పందం
విచారణలో ఉన్నందున వివరాలు వెల్లడిరచలేను
ట్విట్టర్‌ పిట్ట ఇన్నాళ్లు ఎక్కడ పోయాడు..
సభలో సిఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: ఈ-ఫార్ములా సంస్థతో జరిగిన కేటీఆర్‌ లోపాయికారీ ఒప్పందం అంతా ప్రజల ముందు పెడతానని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. అసెంబ్లీలో కేటీఆర్‌ ఈ-ఫార్ములా కేసుపై సీఎం మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ బీఏసీ టింగ్‌లో 9 అంశాలు ఇచ్చారు.. దీంట్లో ఈ ఫార్ములా గురించి ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఈ ఫార్ములా ప్రతినిధి తనను కలిశారని.. ఎవరు వొచ్చినా అందరినీ కలుస్తానని చెప్పారు. ఈ ఫార్ములా ప్రతినిధిని తన ఇంట్లో కలిశానని అన్నారు. తనకేం సంబంధం అని అడిగానన్నారు. కేటీఆర్‌తో అంతా సెటిల్‌ చేసుకున్నానని ఫార్ములా ప్రతినిధి అన్నారు.. అధికారులతో మాట్లాడి చెప్తానన్నానని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఈ-కార్‌ రేస్‌ ప్రతినిధి తనను కలవడంతోనే ఈ బండారం బయటపడిరదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఏసీబీ విచారణలో ఉన్నందున ఇప్పుడు పూర్తి వివరాలు చెప్పలేనని సీఎం రేవంత్‌ రెడ్డి చెప్పారు. ఇక్కడ తానేం చెప్పినా కోర్టుకు వెళ్లి సీఎం తన మీద కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని కోర్టుకు చెప్పుకుందామనుకుంటున్నారని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

ఈ ఫార్ములా సంస్థతో జరిగిన కేటీఆర్‌ లోపాయికారీ ఒప్పందం అంతా ప్రజల ముందు పెడతానని పేర్కొన్నారు. వెంటనే విచారణ జరపాలని.. అధికారులకు సూచించానన్నారు. ఇప్పటి వరకు నాలుగుసార్లు సభ జరిగింది.. కానీ దీని గురించి చర్చకి అడగలేదని అన్నారు. ట్విట్టర్‌ పిట్ట ఇన్నాళ్లు ఎక్కడ పోయాడు.. ఈ స్కాంపై ఎక్కడికైనా వొచ్చి చర్చ చేస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. అవసరం అనుకుంటే వాళ్ల పార్టీ ఆఫీసుకైనా వెళ్తానని తెలిపారు.

హెచ్‌ఎండీఏ ఖాతాలోని డబ్బులు లండన్‌ కంపెనీకి ఎలా వెళ్ళాయని సీఎం అడిగారు. ఈ- కార్‌ రేస్‌ అగ్రిమెంట్‌ రూ.55 కోట్లు కాదు.. రూ.600 కోట్లు అని ముఖ్యమంత్రి తెలిపారు. రూ. 600 కోట్లు లూటీ చేయాలని ఫార్ములా ఈ-రేస్‌ తెచ్చారని సీఎం పేర్కొన్నారు. నగదు బదిలీ చేయాలంటే ఆర్బీఐ అనుమతి ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఓఆర్‌ఆర్‌ టెండర్లు రద్దు చేయండని అంటున్నారు.. విచారణ జరగకుండా రద్దు చేస్తారా..? అని సీఎం ప్రశ్నించారు. హరీష్‌ రావు అడిగితేనే ఓఆర్‌ఆర్‌ పై సిట్‌ వేశామన్నారు. ఈ విషయంపై కేసీఆర్‌ ఇంట్లో గొడవ జరిగిందని తెలిపారు. ఇంటికి వెళ్లాక హరీష్‌ కు కొరడా దెబ్బలు ఉంటాయన్నారు. హరీష్‌ బాధను తాను అర్థం చేసుకుంటానని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page