– డ్రగ్స్ కేసులో ‘సిట్’ వేశాం
– నిబంధనల మేరకే స్టేషన్ బెయిల్
– 2029లోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు
– దిల్లీలో సిఎం రేవంత్ రెడ్డి
న్యూదిల్లీ, మార్చి 18: మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. దీనిలో తమ ప్రమేయం ఏ లేదని ఆయన చెప్పారు. దిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో నిబంధనల ప్రకారమే స్టేషన్ బెయిల్ ఇచ్చారు. దీనిలో తమ ప్రమేయం ఏ లేదు.. ఈ వ్యవహారంపై దర్యాప్తునకు సిట్ వేశాం అని చెప్పారు. 2029లోనే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయని సీఎం అన్నారు. 2028లో ఎన్నికలు రావని చెప్పారు. మహిళా రిజర్వేషన్లు ముందుగా అమల్లోకి వస్తే మంచిదేనని అభిప్రాయపడ్డారు. అంతకుముందు పార్లమెంట్‌లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీలను రేవంత్‌రెడ్డి కలిశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తో కలిసి వెళ్లి వారితో సమావేశమయ్యారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డిని రాహుల్, ప్రియాంకలకు రేవంత్ పరిచయం చేశారు. పార్లమెంట్‌లో వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా, సీఎం రేవంత్ రెడ్డి ఎదురుపడగా ఒకరినొకరు పలకరించుకున్నారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు మల్లు రవి, సురేష్ షెట్కర్, రఘురాం రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




