నాంపల్లి కోర్టుకు హాజరైన సిఎం రేవంత్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 20: ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల స్పెషల్‌ ‌కోర్టుకు శనివారం వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ, తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్‌ ‌స్టేషన్లలో గతంలో నమోదైన కేసుల విచారణకు ఆయన హాజరు కావడం విశేషం. మూడు కేసులు ప్రధానంగా ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలు, పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు లేదా రాజకీయ కార్యక్రమాల సందర్భంలో నమోదయినవి. గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వ హయాంలో రేవంత్‌ ‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఈ కేసులు నమోదయ్యాయి. కోర్టులో జడ్జి ముందు రేవంత్‌ ‌రెడ్డి ఎగ్జామినేషన్‌ ‌పక్రియ పూర్తి చేశారు. మూడు కేసుల్లోనూ ఈ దశ పూర్తయిన నేపథ్యంలో తదుపరి విచారణ లేదా తీర్పు కోసం కోర్టు తేదీ నిర్ణయించనుంది. సీఎం హాజరుతో కోర్టు పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మీడియా, సామాన్యులను కోర్టు హాల్ ‌సమీపంలోకి అనుమతించలేదు. కాంగ్రెస్‌ ‌నేతలు ఈ కేసులను రాజకీయ కుట్రతో మోపినవని విమర్శిస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page