పేదల కంచంలో  శ్రీమంతుని బువ్వ..!

‘‘‌రాష్ట్రంలో రేవంత్‌ ‌ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి పేదల రేషన్‌ ‌కార్డుల గురించి వారికీ అందించే రేషన్‌ ‌లోతుగా అధ్యయనం చేసి, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేలందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలన్న విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. నయాపైసా చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం పంపిణీ  తీసుకున్న చారిత్రాత్మకమైన ఘట్టంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాభాలో 85 శాతం మేరకు లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుంది..’’

రాష్ట్రంలోని పేదల ఇళ్లలో సన్నబియ్యం అన్నంతో ఇక ప్రతిరోజూ పండుగ రోజు కానుంది. శ్రీమం తుల ఇళ్లలో తిన్నట్లే.. పేద ప్రజలు కూడా ప్రతి రోజూ సన్నబియ్యం తినేలా చేయాలనే సంకల్పంతో రేవంత్‌ ‌ప్రభుత్వం మూడు కోట్ల మంది ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం అందించే పథకాన్ని ప్రారం భించింది. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు రేషన్‌కార్డులపై సన్నబియ్యం అందించే బృహాత్త రమైన పథకం తెలుగు ప్రజలు పవిత్రంగా భావించే ఉగాది పండుగ రోజున సీఎం లాంఛనంగా ప్రారంభించి సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్‌ ‌నియోజకవర్గానికి చెందిన నిరుపేదలైన 10 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం సంచులను అందజేశారు. నాడు గరీబీ హటావో పథకాన్ని ప్రారంభించిన ఇందిరాగాంధీ స్పూర్తితో నేడు శ్రీమంతులను తలపించేలా పేదలకు సన్నబియ్యం పథకం ప్రారంభంచడం పేదల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది.

కాంగ్రెస్‌ ‌ప్రారంభించిన పథకం ఆషామాషీ కాదు,దేశ చరిత్రలో శిలా శాసనంలా నిలిచిపోయే పథకమని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరంలేదు. ప్రభుత్వాలు తీసుకునే కొన్ని పథకాలు సజీవంగా ఉంటాయని చెప్పేందుకు నాడు పేదల ఆకలి తీర్చేందుకు నిబద్దతతో తెచ్చిన రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం చిరస్మరణీయం.ఇలాంటి పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా.. ఎవరు సీఎంగా ఉన్నా.. ఈ పథకాన్ని కొనసాగించి తీరాల్సిందే. ఇప్పటివరకు రేషన్‌ ‌దుకాణాల ద్వారా పేదలకు దొడ్డు రకాల బియ్యం మాత్రమే అందుతున్నాయి, ఇందుకోసం ప్రతి ఏటా రూ.10,565 కోట్ల ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు. అయితే.. కాలక్రమేణా వాతావరణం, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా పేదవాడు సైతం దొడ్డు బియ్యం తినడం మానేయడంతో అవి పక్కదారి పడుతున్నాయంటే అతిశయోక్తికాదు.

దేశంలో మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 17263 చౌక ధరల దుకాణాల్లో సన్న బియ్యం అందించేందుకు ముందు కొచ్చింది. రాజకీయ పార్టీలకు ఎన్నికలు వచ్చి నప్పుడు మాత్రమే తెల్ల రేషన్‌ ‌కార్డులు గుర్తుకు వచ్చేది.అలాంటిది పేదల బతుకులు క్షుణ్ణంగా పరిశీలించిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అర్హత గల వారికి తెల్ల రేషన్‌ ‌కార్డుల మంజూరికి నిర్ణయం తీసు కుంది. దానితో రేషన్‌ ‌కార్డుల కోసం 30 లక్షల దరఖాస్తులు వచ్చాయంటే దాని తీవ్రత ఎంతవుందో అర్థం చేసుకోవాలి.ప్రస్తుతం ఉన్న గణాంకాల ప్రకారం  రాష్ట్రంలో 90.41 లక్షల కుటుంబాలలో  2.85 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా, ప్రస్తుతం వచ్చిన దరఖాస్తుల ప్రకారం ఆ సంఖ్యతో 3.10 కోట్లకు చేరనుంది.

కాళేశ్వరం నుండి సాగు నీరు రాకపోయినా రైతులు ఈ సారి 66.77లక్షల ఎకరాల్లో వరిపంట సాగు చేసారు.దీనికి తోడుగా ముందు చూపుతో సన్నలకు రూ.500 బోనస్‌ ‌ప్రకటించడంతో రైతులు పెద్ద మొత్తంలో సన్న ధాన్యం వేశారు. గాత ఏడాది వారి సాగు 25 లక్షల ఎకరాలు (38) శాతం ఉండగా గతంతో పోలిస్తే సాగు విస్తీర్ణం ఖరీఫ్‌ ‌సీజన్లో 40.45 లక్షల ఎకరాల్లో (61) శాతం పెరిగిందని గణాంకాలు చెపు తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను  సవాలుగా  తీసుకున్నది ఊహించని విధంగా ఈ  వానాకాలంలో 52. 5 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల రికార్డు స్థాయి ధాన్యం సేకరించి దేశంలో మూడో స్థానంలో నిలిచింది. రూ.500 బోనస్‌ ఇచ్చిన కారణంగా యాసంగి సీజన్‌ ‌లో  దిగుబడి తగ్గినా సన్నాలతో లాభమనే ఆలోచనతో సన్న వడ్లు సాగు చేసేందుకే రైతులు ఎక్కువగా మొగ్గు చూపేందుకు కారణమన్నారు.

రాష్ట్రంలో రేవంత్‌ ‌ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి పేదల రేషన్‌ ‌కార్డుల గురించి వారికీ అందించే రేషన్‌ ‌లోతుగా అధ్యయనం చేసి, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేలందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలన్న విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. నయాపైసా చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సన్నబియ్యం పంపిణీ  తీసుకున్న చారిత్రాత్మకమైన ఘట్టంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాభాలో 85 శాతం మేరకు లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుంది.‘ఇదే కాంగ్రెస్‌ ‌గ్రామీణ భారతదేశంలోని పేద వర్గాలకు చేరువ కావడాన్ని లక్ష్యంగా 1971 ఎన్నికలలో, ఆమె గరీబీ హఠావో నినాదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించినా, 200యూనిట్లు కరెంట్‌ ‌ఫ్రీ ఇచ్చినా,మూడు కోట్ల మందికి సన్నబియ్యం ఇచ్చినా పేద ప్రజలు ఆసరా పింఛన్‌ ‌కోసం ఆరాటం మాత్రం తప్పడంలేదు.

ఎన్నికల ముందు 4000 ఇస్తామని ఇవ్వలేదనే అసంతృప్తితో ఉన్నారనేది యదార్థం.పేదలకు పట్టెడన్నం పెట్టాలన్న కాంగ్రెస్‌ ‌సిద్ధాంతాన్నిసోనా ,బీపీటీ, ఎంటియు లాంటి సన్నబియ్యం అందించి శ్రీమంతుని బువ్వ పెట్టే పథకంతో నిజం చేయాలన్నదే ప్రభుత్వం సంకల్పం.గత 15నెలలుగా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ప్రవేశపెట్టిన అనేక పథకాల ఆ కోవలోనిదే రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సన్నబియ్య పథకం’ రేవంత్‌ ‌సాహసోపితమైన  నిర్ణయాలు చిరస్థాయిగా గుండెల్లో నిలిచిపోవడం ఖాయం.గరీబీ హఠావో దేశ్‌ ‌బచావో అనేది ఎన్నికల ప్రచారంలో ఇందిరా గాంధీ నినాదం మాత్రమే ‘‘ఇది వారికి రాజకీయంగా సహాయపడిన ‘జుమ్లా’, కానీ పేదలకు సహాయం చేయలేదు’’ అని రాజకీయ వేదికలపై మోడీ విమర్శించారు.

image.png
-డాక్టర్‌ ‌సంగని మల్లేశ్వర్‌,
‌విభాగాధిపతి, జర్నలిజం శాఖ
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్‌,
‌సెల్‌-9866255355

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page