అర్హులైన పేదలందరికీ రేషన్‌,‌హెల్త్ ‌కార్డులు

త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు ఎంపిక
ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన

భద్రాచలం/ఇల్లందు , ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 23 : ‌ అర్హులైన పేద‌లంద‌రికీ రేష‌న్ కార్డుల‌, హెల్త్ కార్డుల‌ను అంద‌జేస్తామ‌ని రెవెన్యూ, హౌసింగ్‌ ‌సమాచార పౌర  సంబంధాల శాఖ మంత్రి  పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి హామీ ఇచ్చారు.  సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజవర్గంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. ఇల్లెందు మండలంలోని ముకుందాపురం నుంచి కట్టుగూడెం వరకు రూ.5 కోట్లతో బీటీ రోడ్డు,మోడీ కుంట నుంచి రామచంద్రారావు పేట వరకు రూ.50 లక్షలతో నిర్మించ‌నున్న‌ బిటి రోడ్డుకు, ఇల్లందులో రూ.1 కోటితో స్విమ్మింగ్‌ ‌పూల్‌కు, బుగ్గ బాబు రిటైనింగ్‌ ‌వాల్‌ ‌నిర్మాణం, ఆడిటోరియం నిర్మాణం, ఫౌంటెన్ల  నిర్మాణం, మోడల్‌ ‌మార్కెట్‌ ‌ప్రహరీ గోడ నిర్మాణం, ఆర్‌ అం‌డ్‌ ఆర్‌ ‌కాలనీలో రూ.1.30 కోట్ల తో పార్కుకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం బొజ్జాయిగూడెంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఖమ్మం, మహబూబాబాద్‌, ‌భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి జిల్లాలోని వివిధ శాఖలలో మంజూరై వివిధ దశలలో ఉన్న అభివృద్ధి పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఇటీవ‌ల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల , సిసి రోడ్లు మరమ్మతులు పనులు ఎంతవరకు పూర్తి అయ్యాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు సాంక్షన్‌ అయి ఉంటే త్వరగా పూర్తి చేయాలని, మంజూరు కాని పనుల కోసం వెంటనే ప్రతిపాదనలు పంపించి త్వరతగతిన పనులు చేపట్టాలన్నారు. పట్టణాలు, గ్రామాలలో విద్యుత్‌ ‌సరఫరా ఆటంకం కలుగకుండా సరఫరా చేయాలని, గ్రామాలలో వదులుగా ఉన్న కరెంటు తీగలను సరిచేయాలన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల పనులు పూర్తి చేయాలని, ప్రతీ ఇంటికి మిషన్‌ ‌భగీరథ మంచి నీరు అందజేయాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.  రాష్ట్ర ప్రభుత్వం వైద్య, విద్యా వ్యవస్థలపై  ప్రత్యేక దృష్టి సారించిందని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా పనిచేయాలన్నారు.

జిల్లాలో ఆక్రమణకు గురయిన ప్రభుత్వ స్థలాల విషయంలో ఎంత పెద్ద వారివైనా ఉపేక్షించకుండా పోలీసు వారి సహకారంతో ఒక్క గజం కూడా వదలకుండా రాబట్టేలా చర్యలు చేపట్టాలని అన్నారు. మహిళల ఆర్థిక చేయూతకు  మహిళాశక్తి ద్వారా యూనిట్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి వారి ఆర్థిక అభ్యున్నతికి తోడ్పాటు నందించాలని సూచించారు. సీఎం రేవంత రెడ్డి న్యాయకత్వంలోని ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో పేద ప్రజలకు అండగా ఉండడంతో పాటు బడుగు బలహీన దళిత, గిరిజన,మైనారిటీలతో పాటు, ప్రత్యేకించి ఇది గిరిజన ప్రాంతం గిరిజనులకు పూర్తిగా అండగా ఆలోచనలకు తగినట్లుగా అధికారులు దృష్టి పెట్టాలని తెలిపారు. అక్టోబర్‌ 2 ‌నుంచి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్‌ ‌కార్డు, హెల్త్ ‌కార్డులు ప్రభుత్వం జారీ చేయనుందని, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల లబ్ది దారులను ఫైనల్‌ ‌చేయబోతుందని చెప్పారు.

ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరే విధంగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్‌, ఇల్లందు మున్సిపల్‌  ‌చైర్మన్‌ ‌డి. వెంకటేశ్వర్లు,   ఐడిసి చైర్మన్‌ ‌మువ్వా విజయబాబు, మహబూబాబాద్‌ ‌జిల్లా కలెక్టర్‌ అద్వైత్‌ ‌కుమార్‌ ‌సింగ్‌, ‌భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌ ‌జితేష్‌ ‌వి.పాటిల్‌, ‌భద్రాచలం ఐటీడీఏ పిఓ బి.రాహుల్‌, ‌భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్‌,‌మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, సొసైటీ చైర్మన్లు మూల మధుకర్‌రెడ్డి, వడ్లమూడి దుర్గా ప్రసాద్‌, ‌మెట్టెల కృష్ణ,మేకల మల్లిబాబు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *