బిఆర్‌ఎస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తున్నదా ?
దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ప్రజలతో మమేకమైన భారత రాష్ట్రసమితి తాజా పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వొచ్చింది. రాష్ట్రంలోని 17 లోకసభ స్థానాల్లో ఒక్క స్థానంలోకూడా తమ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయిందంటే ఆ పార్టీకి ప్రజలు దూరమవుతున్నారన్నది స్పష్టమవుతున్నది. ప్రతిపక్ష పార్టీలు మొదటినుండీ ఈసారి బిఆర్‌ఎస్‌కు ఒక్క స్థానంకూడా రాదన్నట్లుగానే ఫలితాలు వెల్లడైనాయి. మెదక్ నియోజకవర్గం…