హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8: గత మూడేళ్లుగా బంగ్లాదేశ్, పాకిస్థాన్ తదితర దేశాల్లో పోలియో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఆయా దేశాల నుంచి మన దేశానికి రాకపోకలు జరుగుతున్న జిల్లాల్లో పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 290 జిల్లాలను ఎంపిక చేయగా అందులో మన రాష్ట్రం నుంచి 5 జిల్లాలు (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హన్మకొండ) ఉన్నాయి. వీటితోపాటు వరంగల్ జిల్లా పరిధిలోని పట్టణ ప్రాంతంలోనూ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ ఆరు జిల్లాల పరిధిలో 0-5 సంవత్సరాల వయసు పిల్లలు 17,56,789 మంది ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. వీరందరికీ ఈ నెల 12న స్పెషల్ డ్రైవ్‌లో పోలియో వ్యాక్సిన్ వేయనున్నారు. అప్పుడే పుట్టిన శిశువుల దగ్గర్నుంచి 5 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ వ్యాక్సిన్లు వేయించాలని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





