విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించండి..

నారాయణపేట కలెక్టర్‌కు సీఎం రేవంత్‌ ‌రెడ్డి ఆదేశాలు
హైస్కూల్‌లో మధ్యాహ్నభోజనం వికటించిన ఘటనపై సీఎం ఆరా

నారాయణ పేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 20 : ‌నారాయణపేట జిల్లాలోని మాగనూరు హైస్కూల్లో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ ‌రెడ్డి ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలని, కారణాలేమిటో దర్యాప్తు చేసి బాధ్యులెవరో నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ ‌ను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page