మార్చికల్లా 4వేల మెగావాట్ల ఉత్పత్తి

  • భూ నిర్వాసితులకు తక్షణ పరిహారం
  • ప్లాంట్‌ వరకు నాలుగులేన్ల రహదారి నిర్మాణం
  • యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ పనులప మంత్రుల సవిూక్ష

నల్లగొండ,ప్రజాతంత్ర,సెప్టెంబర్‌11:  యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్టు కోసం భూమి కోల్పోయిన వారిని మనం గౌరవించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.  మహోన్నత ఆశయం కోసం వారు భూమిని త్యాగం చేశారు. ప్రాజెక్టు ప్రారంభమయ్యేలా అర్హులైన వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దామరచర్లలోని యాదాద్రి పవర్‌ప్లాంట్‌ ఆయల్‌ సింకరైజేషన్‌ పరిశీలించిన అనంతరం సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భూ నిర్వాసితులకు పరిహారం సత్వరమే చెల్లించాలని అధికారులను ఆదేశించారు.

2025 మార్చి కల్లా యాదాద్రిలో 4000 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయడమే టార్గెట్‌గా పెట్టుకోవాలన్నారు. కూలీలను పెద్ద ఎత్తున తీసుకోవాలని సూచించారు. పవర్‌ ప్లాంట్‌ నుంచి దామరచర్ల వరకు బొగ్గు రవాణా ఇతర అవసరాలకు నాలుగు లైన్ల ప్రత్యేక రహదారి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, తదితరులు ఉన్నారు. దామచర్ల యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ ప్రాజెక్ట్‌ పనులపై జిల్లా కలెక్టర్‌, అధికార యంత్రాంగంతో డిప్యూటీ సీఎం, మంత్రులు బుధవారం రివ్యూ విూటింగ్‌ నిర్వహించారు.

 

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి రివ్యూ విూటింగ్‌  నల్గొండ జిల్లా కలెక్టర్‌, ఎస్పీతోపాటు పవర్‌ ప్లాంట్‌ ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు. వొచ్చే మార్చి లోపు పవర్‌ ప్లాంట్‌ నుంచి 4వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు.

 

మహోన్నత ఆశయం కోసం భూమిని త్యాగం చేసి.. ప్రాజెక్టు కోసం భూమి కోల్పోయిన వారిని గౌరవించాలని.. భూ నిర్వాసితులకు పరిహారం సత్వరమే చెల్లించాలని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు.  ప్రాజెక్టు ప్రారంభమయ్యే లోగా అర్హులైన వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని అన్నారు. కూలీలను పెంచి, పవర్‌ ప్లాంట్‌ నుంచి దామరచర్ల వరకు బొగ్గు రవాణా, ఇతర అవసరాలకు 4 లైన్ల ప్రత్యేక రహదారి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మంత్రులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *