ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్, బలగం ఫేమ్ కొమురమ్మ, మొగిలయ్య ఎంపిక
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11 : పొన్నం సత్తయ్య గౌడ్ 14వ వర్ధంతిని పురస్కరించుకొని ‘‘పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం-2024’’ ప్రదానోత్సవ కార్యక్రమం ఈనెల 13న, శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ రవీం ద్రభారతిలో నిర్వహించనున్నారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవాణా, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధ్య క్షతన జరగనున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, తెలంగాణ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య తదితరులు హాజరుకానున్నారు.
ప్రముఖ సినీ గేయ కవి, అస్కార్ అవార్డు గ్రహీత కె.ఎస్. చంద్రబోస్, బలగం ఫేమ్ కొమురమ్మ, మొగిలయ్య పురస్కారాలను ప్రదానం చేసి రూ.51వేల నగదు, మెమోంటోతో ఘనంగా సత్కరిం చనున్నారు. ప్రతి ఒక్క రూ హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్, సీనియర్ న్యాయవాది పొన్నం అశోక్ గౌడ్, ఫ్రీ లాన్స్ జర్నలిస్టు పొన్నం రవిచంద్ర, కోరారు.