పాల్గొననున్న సీఎం రేవంత్ తదితరులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20: గచ్చిబౌలి లోని జీఎంసీ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగ నిర్వహణ ఏర్పాట్లపై ఆయుష్ శాఖ అధికారులతో శుక్రవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్షా సమావేశం నిర్వహించారు. యోగ డే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగ కార్యక్రమం లో భాగంగా తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆయుష్ శాఖ కు చెందిన యోగ శిక్షకులు, మెడికోలు, వివిధ పాఠశాల లకు చెందిన 5500 విద్యార్థులు పాల్గొంటారు. యోగ డే కార్యక్రమంలో భాగంగా ఉదయం 6.20 నుండి 6.30 వరకు స్టేడియంలో యోగ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్నారు.
6.30 నుండి 7.00 ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ ప్రసంగం ను విక్షేందుకు స్టేడియం లో ఎల్ ఈడీ లు ఏర్పాటు చేశారు. అనంతరం 7.00 నుండి 7.45 వరకు యోగ కార్యక్రమ నిర్వహణ వుంటుంది. 7.45 నుండి 7.50 వరకు యోగా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిధులను వేదిక పైకి ఆహ్వానిస్తారు. 7.50 నుండి 8.00 వరకు మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహంలు యోగా ప్రాధాన్యత గురించి ప్రసంగిస్తారు. 8.00 నుండి 8.05 వరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగం వుంటుంది. 8.05 నుండి 8.15 వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు.
8.15 నుండి 8.20 వరకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. అనంతరం 8.20 నుండి 8.30 వరకు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన సందర్భంగా బెలూన్స్ లను గౌరవ అతిధులు ఆకాశం లో వదులుతారు.యోగ కార్యక్రమంలో పాల్గొనే వారందరికీ ఉదయం అల్పాహారం ను అందించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, మేయర్ విజయలక్ష్మి, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు.