– అమరవీరులకు నివాళులర్పించిన విప్ అయిలయ్య
యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీరామ్ విల్లాస్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సభ జరిగింది. ప్రభుత్వ విప్ అయిలయ్యతోపాటు ఏసీపీ శ్రీనివాస్ నాయుడు అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ నుండి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సభాస్థలి వరకు ర్యాలీ నిర్వహించారు. కాగా, కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీరామ్ విల్లాస్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





