‘సృష్టి’ తరహాలో మరో మోసం బట్టబయలు

– పిల్లలను విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
– 12మంది ముఠా సభ్యుల అరెస్ట్

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 24:‌ భాగ్యనగరంలో మరో సృష్టి కేసు వెలుగులోకి వచ్చింది. పసి పిల్లలను అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. పిల్లల విక్రయానికి లక్షల్లో లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో సరోగసి పేరుతో దంపతుల నుంచి లక్షల్లో వసూలు చేసి పిల్లలను అక్రమంగా విక్రయించిన సృష్టి కేసు రాష్ట్రంలో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో పసిపిల్లలను తెచ్చి అంటగట్టడం ద్వారా లక్షల్లో దోచుకున్న ముఠా గుట్టురట్టయ్యింది. దాదాపు 12 మంది ముఠా సభ్యులను అరెస్ట్ ‌చేసిన పోలీసులు వారి బారి నుంచి పిల్లలను రక్షించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పిల్లలను తెచ్చి అమ్ముతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్‌లో దాదాపు 15 మంది పిల్లలను అమ్మిన ముఠాను సైబరాబాద్‌ ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు. పక్కా ప్రణాళికతో శిశువులను విక్రయిస్తున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా నగరంలోని ఎనిమిది హాస్పిటల్స్‌కు ఏజెంట్లగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠా నుంచి ఇద్దరు బాలలను ఎస్వోటీ పోలీసులు కాపాడారు. అంతేకాక ఒక్కొక్క శిశువు అమ్మకం వెనకాల రూ.15 లక్షల లావాదేవీలు జరిగినట్లు విచారణలో బయటపడింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page