వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా ఎనలేని సేవలు
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతాపం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 1: ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, మెజిషియన్, బహుముఖ ప్రజ్ఞాశాలి బీవీ పట్టాభిరామ్ మృతిపట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. డిప్రెషన్. ఒత్తిడిలోకి లోనైన ఎంతోమందిని తన వ్యక్తిత్వ వికాసంతో జీవితం పట్ల సానుకూల దృక్ఫథంతో ముందుక సాగేలా కృషి చేశారన్నారు. వ్యక్తిత్వ వికాసంపై తెలుగు, ఇంగ్లీష్, కన్నడ, తమిళ భాషల్లో ఆయన రాసిన పుస్తకాలు ఎంతో ప్రచార్యం పొందాయని చెప్పారు. విద్యార్థులను ఉన్నత వ్యక్తిత్వంతో తీర్చిదిద్దేంకు తెలుగు రాష్ట్రాల్లో వేలాదిగా వ్యక్తిత్వ వికాస తరగతులు, సెమినార్లు ఆయన నిర్వహించారని చెప్పారు. పట్టాభిరామ్ మృతి విద్యావ్యవస్థకు తీరని లోటుగా ఉప ముఖ్యమంత్రి అభివర్ణించారు. మెజీషియన్‌గా ఆయన నిర్వహించిన కార్యక్రమాలు వినోదాన్ని పంచడంతోపాటు మూఢ నమ్మకాలను పారద్రోలేలా చేశాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు.