– సెంట్రల్ హాలును త్వరగా పూర్తి చేయాలి
– పబ్లిక్ గార్డెన్‌లో సభ్యులకు క్లబ్ ఏర్పాటు
– స్పీకర్, మండలి ఛైర్మన్ తో సిఎం రేవంత్ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27: అసెంబ్లీ ప్రాంగణం పార్లమెంట్ తరహాలో ఉండేలా అవసరమైన మార్పులు చేపట్టాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో చేపట్టాల్సిన పనులపై శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సభ గౌరవం పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సభ్యులకు మరింత ప్రైవసీ ఉండాలన్నారు. పబ్లిక్ గార్డెన్‌లో సభ్యుల కోసం క్లబ్ ఏర్పాటు చేయాలని, వాకింగ్ ట్రాక్, క్రీడల కోసం ఏర్పాట్లు ఉండాలని సూచించారు. వచ్చే సెషన్ నాటికి సెంట్రల్ హాల్ సిద్ధం కావాలన్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహాలో ఉండాలని సీఎం రేవంత్ గతంలోనే సూచనలు చేశారు. హెరిటేజ్ భవనాలకు నష్టం కలగకుండా చర్యలు ఉండాలని కూడా సూచించారు. అసెంబ్లీ ప్రాంగణం భద్రతను పటిష్టం చేయాలన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




