మెడికల్  టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నాం

– ది హాస్పిటల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 27 : హైదరాబాద్‌లో మెడికల్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామని, వైద్యం కోసం వచ్చే వారి కోసం మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి డైరెక్ట్‌గా విమానాలు హైదరాబాద్ వచ్చేలా కేంద్రాన్ని కోరామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులో అపోలో హాస్పిటల్స్ ది హాస్పిటల్ ఆఫ్ గ్రాటిట్యూడ్‌ను ఆయన సోమవారం ప్రారంభించారు. . అపోలో అనే పదం కోట్లాదిమంది ప్రజల గుండె ధైర్యం అంటూ సమాజానికి ఆదర్శంగా నిలిచిన ఆపోలో యాజమాన్యాన్ని అభినందిస్తున్నాన్నారు. చెన్నైలో అపోలో మొదటి హాస్పిటల్‌ను 46 యేళ్ల క్రితం ప్రారంభించిన ప్రతాప్ రెడ్డి దేశంలో అనేక హాస్పిటల్స్ ప్రారంభానికి మార్గదర్శి అయ్యారని కొనియాడారు. కాగా, అంతర్జాతీస్థాయిలో హెల్త్ సిటీని ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేయబోతున్నామని, గ్రీన్ ఛానల్ ద్వారా హాస్పిటల్స్‌కు రోగులను చేర్చేందుకు ఎయిర్‌పోర్టు అథారిటీతో మాట్లాడుతున్నామని చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్‌లు ఇక్కడినుంచే ఉత్పత్తి అయ్యాయనపి, 40 శాతం బల్క్ డ్రగ్స్ హైదరాబాద్‌లో ఉత్పత్తి అవుతున్నాయని చెప్పారు. తమ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఒక సోషల్ డాక్టర్ అని చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని, ప్రభుత్వం పెట్టుబడులకు భద్రత కల్పిస్తుందని, తెలంగాణ అంటే వ్యాపారం.. వచ్చి పెట్టుబడులు పెట్టండి అని పిలుపునిచ్చారు. మంత్రి దామోదర రాజనర్సింహ, అపోలో హాస్పిటల్స్ యాజమాన్యం హాజరయ్యారు.
—————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *