– లోతట్టు ప్రాంతాల ప్రజల భద్రతపై దృష్టి పెట్టాలి
– పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి
– అధికార్లు 24 గంటలు అందుబాటులో వుండాలి
– మంత్రి కొండా సురేఖ
వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ చేసిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. బుధవారం మంత్రి వరంగల్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ తో జిల్లా అధికారులతో మంత్రి మాట్లాడుతూ.. తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాల వల్ల… రైతులకు నష్టం వాటిల్లకుండా వ్యవసాయ, మార్కెటింగ్, రెవిన్యూ, డి ఆర్డీ ఓ సంబందిత శాఖల అధికారులు సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉంటూ అవసరమైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పునరావస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకు తరలించేలా పూర్తి సన్నదతో ఉండాలని అధికారులకు సూచించారు. జిల్లాల్లోని అన్ని చెరువులు నిండి ఉన్నందున, ఆయా లోతట్టు ప్రాంతాల్లో ముందస్తుగా పునరావస కేంద్రాలను సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా జిల్లా మండల అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ముఖ్యంగా తాసిల్దారులు, ఆశా వర్కర్లు, అంగన్వాడి వర్కర్లు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. జలమయమయ్య ప్రాంతాలలో నిర్వాసితులైన ప్రజలకు భోజనం, వృద్ధులకు పండ్లు, పిల్లలకు ఓఆర్ఎస్ పాకెట్లు పంపిణీ చేయాలన్నారు. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండి సేవలందించాలని కోరారు. జిల్లాలో ఎక్కడైనా వరద ఉద్ధృతితో రోడ్లు తెగిపోయిన ఉదృతంగా ప్రవహించిన ఆయా ప్రాంతాల్లో ఆ గ్రామ ప్రజలు వెళ్లవద్దని బ్యారికేడ్‌లు ఇతర పరికరాలు ఏర్పాటు చేసి ప్రమాదాల బారిన పడకుండా చూడాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు చెరువులు కుంటలు లోని నీటిమట్టలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేస్తూ క్లోరినేషన్ చేపట్టాలన్నారు. ఏమైనా అత్యవసర పరిస్థితులను తన దృష్టికి గాని జిల్లా కలెక్టర్ల దృష్టికి గాని తీసుకురావాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. అత్యవసర సహాయం కొరకు ప్రజలు వరంగల్, హన్మకొండ జిల్లా కలెక్టరేట్ 1800 425 3424, 9154225936, 1800 425 1115 గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో 1800 425 1980, 9701999676 , విద్యుత్ కు సంబంధించిన సమస్యలను పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో 1800 425 0028 ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్లకు సంప్రదించాలని మంత్రి కొండా సురేఖ కోరారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





